Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: భారత క్రికెట్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తూ.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను ఉద్దేశించి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మయాంతి లాంగర్‌తో మాట్లాడిన కోహ్లీ.. జట్టు మేనేజ్మెంట్తో తనకు జరుగుతున్న ‘అప్ అండ్ డౌన్’ కమ్యూనికేషన్ (స్పష్టత లేని మాటలు) గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్‌పై కన్నేసిన 38 ఏళ్ల ఈ రన్ మెషీన్, తాను ఇకపై ఎవరికీ తన విలువను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టాడు. కోహ్లీ తన ప్రస్తుత మానసిక స్థితిని వివరిస్తూ.. “ఈరోజు నా ఆలోచనా విధానం చాలా స్పష్టంగా ఉంది. నా వల్ల టీమ్‌కు మేలు చేకూరుతుందని నేను నమ్మినప్పుడు, అలాగే నా అవసరం జట్టుకు ఉందని అవతలి వాళ్లు భావించినప్పుడు మాత్రమే నేను అక్కడ కనిపిస్తాను. అంతేగానీ, నేను ఇంకా నా విలువను, నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తే అక్కడ ఉండలేను. ఎందుకంటే నా ఆట పట్ల, నా ప్రిపరేషన్ పట్ల నేను చాలా నిజాయితీగా ఉన్నాను” అని స్పష్టం చేశాడు.
2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రదర్శన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. గత ఏడాది (2025) మే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు సైతం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకోవాలనే బలమైన లక్ష్యం ఉన్నప్పటికీ.. కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లు అతడిని బలవంతంగా టెస్ట్ సెటప్ నుంచి పక్కన పెట్టేలా చేశారనే వార్తల నడుమ కోహ్లీ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఆ తర్వాత వన్డే క్రికెట్లో సెంచరీల వర్షం కురిపిస్తూ తన విమర్శకుల నోళ్లు మూయించిన కోహ్లీ.. సుదీర్ఘ విరామం తర్వాత, ఏకంగా 15 ఏళ్ల తర్వాత దేశీవాళీ టోర్నీ అయిన ‘విజయ్ హజారే ట్రోఫీ’లోనూ బరిలోకి దిగి తన నిలకడను చాటుకున్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
సెలెక్టర్లు, కోచ్‌ల ద్వంద్వ ప్రమాణాలను విరాట్ కోహ్లీ ఎండగట్టాడు. “కొందరు వ్యక్తులు నా విషయంలో విషయాలను అనవసరంగా క్లిష్టతరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది అలా.. ఇది ఇలా అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నా ముఖం మీదే ముందే స్పష్టంగా, నిజాయితీగా చెప్పండి లేదా నోరు మూసుకుని నన్ను ప్రశాంతంగా ఆడుకోనివ్వండి. ఒక వారం ఏమో ‘మాకు నీ సామర్థ్యాలపై నమ్మకం ఉంది’ అంటారు, కట్ చేస్తే వారం తిరగకముందే నువ్వు ఆడే విధానాన్ని ప్రశ్నిస్తారు” అని కోహ్లీ మండిపడ్డాడు. “అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను జట్టుకు పనికిరాననో లేదా నా అవసరం లేదనో మొదటి రోజే నా ముఖం మీద చెప్పేయండి. లేదు, నువ్వు జట్టుకు చాలా ముఖ్యం, నీ గురించి మేం వేరేలా ఆలోచించడం లేదు అని చెప్తే.. ఇక సైలెంట్‌గా ఉండండి, మధ్యలో వేళ్లు పెట్టకండి. కేవలం వచ్చే ఫలితాలను బట్టి వారం వారానికి మీ మాటలు, నిర్ణయాలు మారుస్తూ ఉంటే.. మీరు ఎప్పటికీ ఒక స్థిరమైన స్టాండ్ తీసుకోలేరు” అంటూ కోహ్లీ తీవ్రమైన పదజాలంతో గంభీర్, అగార్కర్ ద్వయానికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..