Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్‌గా వైభవ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని ఒక దురదృష్టకరమైన రికార్డు వెంటాడుతోంది. గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో జరుగుతున్న హై-ప్రెషర్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. పవర్‌ప్లేలోనే 500 పరుగుల మైలురాయిని దాటి ప్రపంచ రికార్డు సృష్టించిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, వ్యక్తిగత స్కోరు 96 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ చేరాడు.
ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ నైంటీస్ (90s) లో అవుట్ కావడం ఇది మూడోసారి. దీంతో ఐపీఎల్ ఒకే సీజన్లో అత్యధిక సార్లు 90 పరుగుల మార్కు వద్ద అవుటైన ఆటగాడిగా ఆస్ట్రేలియా గ్లెన్ మాక్స్వెల్ పేరిట ఉన్న ఒక చెత్త రికార్డును వైభవ్ సమం చేశాడు. 2014 సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన మాక్స్వెల్ మూడు సార్లు 90ల్లో అవుట్ కాగా, ఇప్పుడు 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ కూడా మూడు సార్లు సెంచరీకి చేరువగా వచ్చి బోల్తా పడ్డాడు. ఈ జాబితాలో లక్నో తరపున ఆడుతున్న మిచెల్ మార్ష్ (2 సార్లు – 2026) తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
గుజరాత్ ముందు భారీ టార్గెట్
వైభవ్ సూర్యవంశీ (96) సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఫెరీరా 11 బంతుల్లో 38 మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైభవ్‌తో పాటు మిగిలిన బ్యాటర్లు కీలక పరుగులు జోడించడంతో గుజరాత్ విజయానికి 215 పరుగుల టార్గెట్ నమోదైంది. ఫైనల్ చేరాలంటే గుజరాత్ టైటాన్స్ ఈ భారీ రన్‌చేజ్‌ను అధిగమించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!