Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి, కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి తన మైండ్‌లో ఎక్కడో ఒకచోట ఉన్న మాట నిజమేనని, కానీ కోచ్‌లు మాత్రం తను ప్రాక్టీస్‌లో ఏం చేశాడో ఇక్కడ కూడా అదే అమలు చేయమన్నారని వైభవ్ తెలిపాడు. మ్యాచ్‌ను ఎంజాయ్ చేయమని, ఎలాంటి ప్రెజర్ తీసుకోవద్దని వారు చెప్పిన మాటలనే తాను పాటించానని అన్నాడు.
సెంచరీ మిస్సవ్వడంపై స్పందిస్తూ, తాను వంద పరుగుల గురించి అస్సలు ఆలోచించలేదని, అయితే అవుట్ అయిన బంతిని ఫీల్డర్‌ను చూసి షాట్ ఆడానని చెప్పాడు. అదే షాట్‌ను థర్డ్ మ్యాన్ మీదుగా ఆడి ఉంటే ఈజీగా కనెక్ట్ అయ్యేదని, స్ట్రెయిట్‌గా కొట్టాలనే ప్రయత్నంలోనే మిస్టైమ్ అయి క్యాచ్ ఇచ్చానని వివరించాడు. అంతేకాకుండా, తాను అవుట్ అయినప్పుడు జట్టు స్కోరు 260 దాటుతుందనిపించిందని, అయితే ఇప్పుడు బోర్డుపై ఉన్న 243 పరుగులను కూడా తమ బౌలర్లు డిఫెండ్ చేసుకుంటారనే నమ్మకం తనకు ఉందని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- Rajasthan Royals: 12 ఏళ్ల రికార్డుకు చెక్ పెట్టిన రాజస్థాన్ రాయల్స్.. చేతులెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు..
- Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుకు బ్రేక్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్..
- SRH Vs RR: వైభవ్ విధ్వంసం.. 14 ఏళ్ల క్రిస్ గేల్ రికార్డు బద్దలు..
- SRH Vs RR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తుది జట్లు ఇవే..
పరుగుల వరద పారించిన రాజస్థాన్ రాయల్స్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. వైభవ్ సూర్యవంశీ (97), ధ్రువ్ జురెల్ (50) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటంతో రాజస్థాన్ ఈ మైలురాయిని అందుకుంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ పరిశీలిస్తే, మొదటి 1 నుంచి 6 ఓవర్ల పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 80 పరుగులు చేసింది. ఆ తర్వాత 7 నుంచి 15 ఓవర్ల మధ్య మరింత రెచ్చిపోయి 11 ఫోర్లు, 9 సిక్సర్లతో 127 పరుగులు రాబట్టింది. అయితే ఆఖరి 16 నుంచి 20 ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా పుంజుకుని కేవలం 4 ఫోర్లతో 36 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ను కట్టడి చేశారు.
ఈ మ్యాచ్‌తో నమోదైన చారిత్రాత్మక రికార్డుల వేట..
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసేసరికి ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే ఎన్నో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్ నాకౌట్/ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యధిక స్కోర్ల జాబితాలో 2026లో ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన 254/5 స్కోరు మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు ముల్లన్‌పూర్‌లో హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ చేసిన 243/8 స్కోరు రెండో అత్యధిక స్కోరుగా రికార్డుకెక్కింది. ఈ క్రమంలోనే 2023లో ముంబైపై గుజరాత్ చేసిన 233 పరుగుల రికార్డును రాజస్థాన్ అధిగమించింది.
ఈ ఇన్నింగ్స్‌లో రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 17 సిక్సర్లు బాది, 2025లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ నెలకొల్పిన ప్లేఆఫ్స్ ఇన్నింగ్స్ ఆల్‌టైమ్ మోస్ట్ సిక్సర్స్ రికార్డును సమం చేసింది. అలాగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ మొత్తం 37 బౌండరీలు (20 ఫోర్లు, 17 సిక్సర్లు) కొట్టింది, ఇది ప్లేఆఫ్స్ చరిత్రలోనే రెండో అత్యధికం కాగా, ఈ జాబితాలో గుజరాత్‌పై 38 బౌండరీలు కొట్టిన ఆర్సీబీ టాప్‌లో ఉంది.
ఇక రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. గతంలో 2025లో హైదరాబాద్‌పై చేసిన 242/6 స్కోరు, 2026లో జైపూర్‌లో హైదరాబాద్‌పైనే చేసిన 228/6 స్కోరు రికార్డులను ఇది అధిగమించింది. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన రికార్డును రాజస్థాన్ సమం చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ 200 ప్లస్ స్కోరు చేయడం ఇది 8వ సారి. గతంలో ముంబై vs ఢిల్లీ, హైదరాబాద్ vs పంజాబ్, బెంగళూరు vs పంజాబ్, హైదరాబాద్ vs బెంగళూరు జట్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి. అలాగే ఐపీఎల్ 2026 సీజన్లోనే రాజస్థాన్ రాయల్స్ 8వ సారి 200 ప్లస్ స్కోరు సాధించింది (ఈ సీజన్లో హైదరాబాద్, పంజాబ్, బెంగళూరు చెరో 9 సార్లతో టాప్‌లో ఉన్నాయి).
రాజస్థాన్ బ్యాటర్ల దాడికి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు బౌలర్లు (పాట్ కమిన్స్ 51, ప్రఫుల్ హింగె 47 పరుగులకు 2 వికెట్లు, షకీబ్ హుస్సేన్ 34 పరుగులు ఇచ్చినప్పటికీ ఎకానమీ పరంగా) భారీగా పరుగులు ఇచ్చారు. ఓవరాల్‌గా ముగ్గురు బౌలర్లు 50కి పైగా పరుగులు సమర్పించుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది ఐదో సారి మాత్రమే. మరోవైపు ఈ ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారుతుండటంతో సరికొత్త మైలురాయి నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఏకంగా 11 మంది బ్యాటర్లు 500 కంటే ఎక్కువ పరుగులు సాధించి రికార్డు సృష్టించారు. గత 2025 సీజన్ లోనూ 11 మంది ఈ మార్కును దాటగా, 2018 మరియు 2023 సీజన్లలో ఎనిమిది మంది చొప్పున ఈ ఘనత సాధించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
-
Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
US-Iran: తూచ్.. హార్ముజ్‌పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్‌హౌస్ ఖండన
-
Mental Health: 120కోట్ల మందిని పట్టి పీడిస్తోన్న శాపం.. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ భయ్యా!
-
OG Satellite Rights: ఓజీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న టాప్ ఛానల్!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!