Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షించిన 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మైదానం వెలుపల కూడా భారీగా పెరుగుతోంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడమే కాకుండా, ఒకే ఎడిషన్‌లో 750కు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన వైభవ్ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే అతని బ్రాండ్ ప్రకటనల ‘ఆస్కింగ్ ప్రైస్’ భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
పరిశ్రమ నిపుణుల సమాచారం ప్రకారం.. ఐపీఎల్‌కు ముందు వైభవ్ కాంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్లతో ఏడాదికి దాదాపు రూ. 1 కోటి పరిధిలో ఒప్పందాలు చేసుకున్నాడు. ఐపీఎల్ సమయంలో గూగుల్ యాడ్స్‌లోనూ కనిపించాడు. అయితే, టోర్నమెంట్లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP)గా నిలిచి, 72 సిక్సర్లతో క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత అతని డిమాండ్ రెట్టింపు అయింది. ప్రస్తుతం అతని తరఫున ప్రకటనల కోసం ఏడాదికి రూ. 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
త్వరలోనే శ్రీలంకలో జరిగే ఇండియా-ఎ త్రైపాక్షిక సిరీస్‌కు ఎంపికైన వైభవ్, ఈ నెల చివర్లో ఐర్లాండ్‌తో జరిగే సిరీస్ ద్వారా భారత సీనియర్ జట్టులోనూ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అతని అసాధారణ ప్రతిభపై భారత మాజీ కోచ్, 1983 ప్రపంచకప్ విజేత మదన్ లాల్ ప్రశంసల వర్షం కురిపించారు. సూర్యవంశీకి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల లాంటి మైండ్‌సెట్, దేవుడిచ్చిన ప్రతిభ ఉన్నాయని కొనియాడారు. ప్రస్తుత టాప్ టీ20 ఆటగాళ్లయిన అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ స్థాయిలోనే వైభవ్ ఆటతీరు ఉందన్న ఆయన, భవిష్యత్తులో ఈ కుర్రాడి కోసం కొందరు సీనియర్ ప్లేయర్లు జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. మొత్తానికి అతి చిన్న వయసులోనే అటు రికార్డులతో పాటు ఇటు సంపాదనలోనూ వైభవ్ సూర్యవంశీ సంచలనాలు సృష్టిస్తున్నాడు.
తాజావార్తలు
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!