Vaibhav Sooryavanshi: ఇది గమనించారా? SRHపై వైభవ్ కొట్టిన 12 సిక్సర్లలో ఓ కామన్ పాయింట్ ఉందండోయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుపై వైభవ్ సూర్యవంశీ వరుసగా12 సిక్సర్లు బాదిన తీరు చూస్తే ఎవరికైనా ఒక్కటే అనిపిస్తుంది. ఆ సిక్సర్లన్నింటిలోనూ ఏదో ఒక తెలియని పోలిక కనిపిస్తోందని! అవును, పోలిక ఉంది. అదేంటంటే.. వైభవ్ బాదిన ఆ సిక్సర్లు ఎలాంటి శ్రమ లేకుండా, ఎంతో సునాయాసంగా (ఎఫర్ట్‌లెస్) కొట్టినవే. ఈ సీజన్లో 242 కి పైగా స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోతున్న వైభవ్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ మార్కును తృటిలో మిస్ అయ్యాడు. కానీ, ఒకే సీజన్లో ఏకంగా 65 సిక్సర్లు బాది, క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. మొన్న ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ తన మొదటి సిక్సర్ కొట్టినప్పుడు, అది ఎంతో అలవోకగా సాగింది. బంతి అలా బ్యాట్‌ను తాకిందో లేదో నేరుగా గ్రౌండ్ అవతలికి వెళ్లి పడింది. అది ఫుల్ లెంగ్త్ డెలివరీ కావడంతో బ్యాట్ అలా ఊపగానే బౌండరీ లైన్ దాటేసింది. ఇది బౌలర్ చేసిన తప్పిదం అని అనుకోవచ్చు.
కానీ, అతను కొట్టిన రెండో సిక్సర్‌ను సైతం అలాగే వెళ్లింది. ఆ బంతి పిచ్ అయి చాలా షార్ప్‌గా బౌన్స్ అయినప్పటికీ బౌండరీ లైన్ దాటేసింది. వైభవ్ ఒక అద్భుతమైన హుక్ షాట్‌తో ఆ బంతిని బౌండరీ అవతలికి పంపించేశాడు. ఇక మిగిలిన 10 సిక్సర్లలోనూ ఒకే ఒక్క విషయం కామన్‌గా కనిపించింది. అదే ఏమాత్రం శ్రమ లేకుండా ఈజీగా బాదడం. అతను కొట్టిన మూడో సిక్సర్ ఒక స్ట్రెయిట్ డ్రైవ్. ఈసారి అది మరింత ఈజీగా సిక్సర్ వెళ్లింది. బంతిని గట్టిగా బాదినట్లు కాకుండా, ప్రేమగా నిమురుతూ బౌండరీ అవతలికి బంతికి పంపించాడు. దీనిని స్లో మోషన్లో చూస్తే బంతి బ్యాట్ సరిగ్గా మిడిల్ ఆఫ్ ది బ్లేడ్‌కు తగిలినట్లు స్పష్టమవుతుంది. కాబట్టి ఇది కేవలం శారీరక బలం మాత్రమే కాదు, అతని సాంకేతికత (టెక్నిక్) ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
దీనికి మరో ఉదాహరణే ఆ తర్వాత కొట్టిన ఆరు ఇంచుల అప్పర్-కట్ సిక్సర్. అది నేరుగా ఫెన్స్ దాటి వెళ్ళిపోయింది. ఇక ఐదో సిక్సర్ విషయానికి వస్తే, అది కూడా స్ట్రెయిట్ డ్రైవే. కానీ బంతి బ్యాట్‌కు తగిలిన క్షణంలో అది అసలు బౌండరీ దాటుతుందా లేదా అనే అనుమానం వస్తుంది. ఫీల్డర్ చేతికి చిక్కుతుందేమో అని భయపడేలోపే, అది కాస్తా రోప్స్ అవతలికి దూసుకెళ్లిపోయింది. ఆ తర్వాత కవర్స్ మీదుగా కొట్టిన సిక్సర్ మరింత క్లాసిక్‌గా నిలిచింది. అక్కడ కూడా అదే మ్యాజిక్… బలవంతంగా పవర్ ఉపయోగించకుండా బంతితో సున్నితంగా మాట్లాడినట్టు అనిపించింది. వైభవ్‌కు కేవలం తన బ్యాట్‌తోనే కాదు, బంతితోనూ మంచి స్నేహం ఉన్నట్లుంది. అయితే పవర్ చూపించాల్సిన చోట అతను అస్సలు తగ్గలేదు. ఇక మొన్న వైభవ్ కొట్టిన ఎనిమిదో సిక్సరే అందుకు సాక్ష్యం. ఆ షాట్‌కు ఫీల్డర్ బిత్తరపోగా, బౌలర్ పూర్తిగా నీరసించిపోయి నిలబడాల్సి వచ్చింది. అలాంటి బ్యాటింగ్ ముందు ఎవరైనా మాత్రం ఏం చేయగలరు? ఇలా ఎస్ఆర్హెచ్పై బాదిన అన్ని సిక్సర్లు ఎలాంటి బలాన్ని ఉపయోగించకుండా ఈజీగా బాదినట్లు స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?