Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్‌కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Manjrekar: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కెప్టెన్సీ మార్పులపై మళ్లీ చర్చ మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేని నేపథ్యంలో.. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే బుమ్రా ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్లో కేవలం నాల్గో విజయాన్ని అందించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ భవిష్యత్తులో హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టాలని భావిస్తే.. బుమ్రాను కెప్టెన్సీ రేసులోకి తీసుకురావాలని మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర సూచన చేశాడు.
‘స్పోర్ట్‌స్టార్’ పాడ్‌కాస్ట్‌లో మంజ్రేకర్ మాట్లాడుతూ.. “జస్ప్రీత్ బుమ్రా మరిన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అతనికంటే బాగా గేమ్ రీడ్ చేసే (పరిస్థితులను అంచనా వేసే) ఆటగాడు మరొకరు లేరని నా అభిప్రాయం. బుమ్రా బంతితో చేసే మ్యాజిక్ కేవలం అతని యాక్షన్ లేదా నైపుణ్యాల వల్ల మాత్రమే సాధ్యం కాదు. బ్యాటర్ల ఆలోచనలను ముందే ఊహించడం, మ్యాచ్ సిట్యుయేషన్స్ అర్థం చేసుకోవడం, పిచ్‌లను అంచనా వేయడంలో అతనికున్న చాతుర్యమే దానికి కారణం” అని కొనియాడాడు. ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై అంతా సవ్యంగా లేదనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో మంజ్రేకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హార్దిక్ ఇప్పటికే ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లకు దూరం కాగా.. మిగిలిన సీజన్లో అతను అసలు ఆడతాడా లేదా అనేదానిపై కూడా స్పష్టత లేదు. ఐపీఎల్ 2026 సీజన్లో హార్దిక్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. హార్దిక్ సారథ్యంలో ముంబై జట్టు ప్లేఆఫ్స్ చేరలేకపోవడం గత మూడు సీజన్లలో ఇది రెండోసారి కావడం గమనార్హం.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక బుమ్రా విషయానికి వస్తే.. అతను అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్సీ చేసిన చాలా కాలం తర్వాత ఐపీఎల్లో కెప్టెన్‌గా అరంగేట్రం చేశాడు. బుమ్రా ఇదివరకు మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత జట్టును నడిపించగా.. అందులో టీమిండియా ఒకటి గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. అయితే, బుమ్రాకు కెప్టెన్సీపై పెద్దగా ఆసక్తి లేకపోవడం పట్ల మంజ్రేకర్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. “ఇంగ్లాండ్ టూర్లో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ ఇచ్చినప్పుడు బుమ్రా ఆ బాధ్యతలు తీసుకోలేదు. అతనికి సారథ్యంపై పెద్దగా ఆసక్తి లేకపోవడం నన్ను కొంచెం నిరాశపరిచింది. కానీ, కనీసం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనైనా అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడాలి” అని మంజ్రేకర్ అన్నాడు. నిజానికి హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సహజమైన ఛాయిస్ (మొదటి ఆప్షన్) గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అతను జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండటమే కాకుండా, టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించి సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయినప్పటికీ ముంబై ఫ్రాంచైజీ బుమ్రా వైపే మొగ్గు చూపాలని మంజ్రేకర్ కోరుతున్నాడు.
“నేను ఎందుకు బుమ్రా పేరును సూచిస్తున్నానంటే.. ముంబై యాజమాన్యం ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాను దాటి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. భారత టెస్ట్ కెప్టెన్‌గా ఉంటే ప్రతీ టెస్ట్ మ్యాచ్‌కు ఫిట్‌గా ఉంటూ జట్టును నడిపించాలనే ఒత్తిడి బుమ్రాపై ఉంటుంది. కానీ ఐపీఎల్లో అలాంటి భారం ఉండదు కాబట్టి, బుమ్రాకు షార్ట్-టర్మ్ (స్వల్పకాలిక) కెప్టెన్సీ అవకాశం ఇవ్వాలి” అని మంజ్రేకర్ వివరించాడు. ఒకవేళ బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయినా.. కనీసం టెస్టుల్లోనైనా అతడిని కెప్టెన్‌గా పరిగణించవచ్చని మంజ్రేకర్ వక్కాణించాడు. “కెప్టెన్ అనేవాడు సిరీస్‌లోని మొత్తం ఐదు లేదా ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఖచ్చితంగా ఆడాలనే నిబంధన ఏమీ లేదు. జట్టులో అందరూ బాగా రాణిస్తున్నప్పుడు, అత్యుత్తమ కెప్టెన్ అందుబాటులో ఉన్నప్పుడల్లా అతనితోనే జట్టును నడిపించాలి. నా ఈ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించకపోవచ్చు. కానీ కెప్టెన్సీకి అన్ని అర్హతలు, అద్భుతమైన ట్రాక్ రికార్డ్ బుమ్రాకు ఉన్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబై ఇండియన్స్ బుమ్రాను కెప్టెన్‌గా పరిశీలిస్తుందని ఆశిస్తున్నాను” అని మంజ్రేకర్ ముగించాడు.
తాజావార్తలు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!