Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Sudarshan: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఓ వింత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో అతను అవుట్ అయిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే, కేవలం కొన్ని రోజుల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లోనూ సుదర్శన్ సరిగ్గా ఇలాగే అవుట్ అయ్యాడు. ఒకే సీజన్ లో, అది కూడా బ్యాక్ టు బ్యాక్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకే బ్యాటర్ వరుసగా రెండుసార్లు హిట్ వికెట్‌గా వెనుతిరగడం ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన వింత రికార్డుగా మారింది. నిజానికి ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విధించిన 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సాయి సుదర్శన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి రాజస్థాన్ బౌలర్లను సుదర్శన్ చీల్చిచెండాడాడు. వీరిద్దరూ కేవలం 77 బంతుల్లోనే ఏకంగా 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించేలా కనిపించింది. కేవలం 26 బంతుల్లోనే సుదర్శన్ మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా, ఈ సీజన్లో 700 పరుగుల మైలురాయిని సైతం దాటేశాడు. ఐపీఎల్ 2026లో అత్యధిక పరుగులు చేసిన టాప్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచిన సుదర్శన్, గిల్‌తో కలిసి మ్యాచ్‌ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పేశాడు.
అయితే ఆ తర్వాతే ఆ వింత సంఘటన జరిగింది. ఆఫ్ సైడ్ వెనుక వైపు ఒక షాట్ ఆడబోయిన సుదర్శన్ బ్యాట్, అనూహ్యంగా వెనుక ఉన్న వికెట్లను బలంగా తాకింది. దాంతో అతను హిట్ వికెట్‌గా వెనుతిరగాల్సి వచ్చింది. సుదర్శన్ అవుట్ అయినప్పటికీ గుజరాత్ జోరు మాత్రం తగ్గలేదు. మరోవైపు శుభ్‌మన్ గిల్ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ బాది జట్టును విజయతీరాలకు చేర్చే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. కానీ, మ్యాచ్‌లో ఇంతటి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు నమోదైనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరుపైనే అందరూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో హల్చల్ చేస్తున్నారు. “ఈ రికార్డుల వేటగాడు సాయి సుదర్శన్‌ను ఆపడం ఎవరికైనా సాధ్యమేనా? అతన్ని అవుట్ చేయాలంటే అది కేవలం అతని వల్ల మాత్రమే అవుతుంది” అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. గత రెండేళ్లలోనే అతను ఇలా హిట్ వికెట్ అవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2022లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి ఇలాగే అవుట్ కాగా, మిగిలిన రెండు సార్లు ఈ సీజన్ ప్లేఆఫ్స్‌లోనే జరగడం విశేషం.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ వింత అవుట్లపై మ్యాచ్ ముగిసిన తర్వాత సాయి సుదర్శన్ సరదాగా స్పందించాడు. బ్రాడ్కాస్టర్లతో సుదర్శన్ మాట్లాడుతూ.. దీని నుంచి తప్పించుకోవడానికి ఇకపై బ్యాట్ గ్రిప్‌కు సంబంధించి ఏదైనా కొత్త టెక్నిక్ వాడాలేమో అని నవ్వుతూ అన్నాడు. అసలు ఇది ఎలా జరుగుతుందో నిజంగా తనకే అర్థం కావడం లేదన్నాడు. గత మ్యాచ్‌లో (ఆర్సీబీపై) బంతి టర్న్ అవ్వడం వల్ల వికెట్లను కొట్టేశానని, కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం తానే స్వయంగా వెళ్లి వికెట్లను నేరుగా కొట్టాలని అనుకున్నట్లు ఉందంటూ తనపై తనే జోకులు పేల్చాడు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!