CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్‌లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన పోరాట పటిమను కనబరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జట్టును గౌరవప్రదమైన స్కోరు వైపు నడిపించాడు. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆదిలోనే షాక్ తగిలింది.
టాప్ ఆర్డర్ కుప్పకూలినా..
గుజరాత్ పేసర్ కగిసో రబడ నిప్పులు చెరిగే బంతులతో చెన్నై టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. సంజు శాంసన్ (11), ఉర్విల్ పటేల్ (4), సర్ఫరాజ్ ఖాన్ (0), డెవాల్డ్ బ్రెవిస్ (2) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. కేవలం 47 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే (22)తో కలిసి రుతురాజ్ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
కెప్టెన్ ఇన్నింగ్స్: 74 నాటౌట్
ఒకవైపు పిచ్ స్లోగా మారుతున్నా, మరోవైపు గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నా రుతురాజ్ మొక్కవోని దీక్షతో నిలబడ్డాడు. మొత్తం 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరలో జేమీ ఓవర్టన్ (6 బంతుల్లో 18) మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 158/7 పరుగులు చేయగలిగింది.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
Divy Chaturvedi (@crickwithdivy) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
చెపాక్ మైదానంలో సాధారణంగా 170-180 పరుగులు సగటు స్కోరు. అయితే, ఇక్కడ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది. రబడ 3 వికెట్లతో చెలరేగగా, అర్షద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. ఇన్ని కష్టాల నడుమ రుతురాజ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ జట్టుకు ప్రాణం పోసింది. ఒకవేళ రుతురాజ్ త్వరగా అవుట్ అయ్యుంటే చెన్నై కనీసం 100 పరుగులు కూడా దాటడం కష్టమయ్యేది. ఇప్పుడు 159 పరుగుల లక్ష్యం గుజరాత్‌కు సవాలుతో కూడుకున్నదే. చెన్నై బౌలర్లు అప్రమత్తంగా ఉంటే, ఈ స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. రుతురాజ్ చేసిన ఈ ‘ఒంటరి పోరాటం’ ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Simbu – Nayan: పదేళ్ల తర్వాత శింబుతో నయన్ జోడి.. వైరల్ అవుతున్న క్రేజీ న్యూస్!
-
Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
-
SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త బాదుడుపై ఒక లుక్ వేయండి!
-
Murasu Cyclone : ఏపీ వైపు మురసు తుఫాన్.. 120 కి.మీ. వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!