Rohit Sharma: రోహిత్ శర్మ హెల్త్ రిపోర్ట్ రిలీజ్.. ఇకపై ఆడాలా? వద్దా? అనే నిర్ణయం హిట్‌మ్యాన్ చేతుల్లోనే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma injury update: రోహిత్ శర్మ గాయంపై ముంబై ఇండియన్స్ (MI) అభిమానుల్లో గందరగోళం నెలకొంది. మంగళవారం జరిగిన నెట్ సెషన్స్‌లో రోహిత్ ఎక్కడా కనిపించలేదు. దీంతో రోహిత్‌కు గాయం పెద్దదిగా మారిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ ఆడతాడా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇంతలో హిట్‌మ్యాన్ హెల్త్ రిపోర్టు వెలువడింది. క్రికెట్ బజ్ తాజా నివేదిక ప్రకారం.. మ్యాచ్ అనంతరం రోహిత్‌కు స్కానింగ్ నిర్వహించారు. ఈ రిపోర్టులో ఎటువంటి కండరాల చిరుగు (Tear) ఉన్నట్లు ఆధారాలు లభించలేదు. ప్రాథమిక మెడికల్ రిపోర్ట్‌లో కండరాల సంబంధిత సమస్యలు ఏవీ లేవని (No signs of a tear) తేలింది. అయితే, ఈ మెడికల్ రిపోర్ట్ ఇంకా అసంపూర్తిగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. హిట్‌మ్యాన్‌కు మరికొన్ని పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి హెల్త్ రిపోర్టు వచ్చిన తర్వాతే గాయంపై పూర్తి స్పష్టత వస్తుంది.
READ MORE: AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. 12 ఏళ్ల రికార్డు బ్రేక్..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఒకవేళ ఇది తీవ్రమైన గాయం కాకపోతే, రాబోయే మ్యాచ్‌లకు రోహిత్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా, బీసీసీఐ మెడికల్ టీమ్ ప్రస్తుతం రోహిత్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. త్వరలోనే ఈ అంశంపై ముంబై ఇండియన్స్ లేదా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు సీరియస్‌గానే పరిగణించబడతాయట. అయితే.. రోహిత్ అయిన గాయాన్ని పరిశీలిస్తే మరీ ఎక్కువ మ్యాచులకు దూరం కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడించి రిస్క్ తీసుకోవడం కంటే, విశ్రాంతినిచ్చి గాయం తీవ్రం కాకుండా చూడాలని మేనేజ్మెంట్ భావిస్తోందట. అయినప్పటికీ, తన అనుభవం దృష్ట్యా తుది నిర్ణయాన్ని మేనేజ్మెంట్ రోహిత్ కే వదిలేసింది. ఆడాలా? వద్దా? అనేది రోహిత్ చేతిలోనే ఉంది.
READ MORE: Ruturaj Gaikwad: సాకులు చెప్పను.. గెలిచినా మేం ఇంకా మెరుగుపడాలి!
ఇంతకీ రోహిత్ శర్మకి ఏమైంది?
ఆదివారం(ఏప్రిల్ 13న) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), ముంబై ఇండియన్స్(MI)కి జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మకు గాయమైంది. 241 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆరో ఓవర్లో 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు రోహిత్. తర్వాత రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక ఆరో ఓవర్ ప్రారంభానికి ముందు రోహిత్ (Rohit Sharma) ఇబ్బందిపడుతూ కనిపించాడు. ఫిజియో వచ్చి ట్రీట్‌మెంట్ అందించాడు. ఆ ఓవర్‌లో రెండో బంతిని ఎదుర్కొన్న తర్వాత రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. తర్వాత ఈ బ్యాటర్ తిరిగి బ్యాటింగ్‌కు రాలేదు. ఈ మ్యాచ్‌లో ముంబయి 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 137 రన్స్ చేశాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..