Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్‌కు బిగ్ షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant: టీమిండియాలో ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ ఆసక్తికరంగా మారింది. దీంతో రిషబ్ పంత్‌కు చేదు వార్త వెలవడనున్నట్లు తెలుస్తోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్‌లో అంతగా రాణించడం లేదు. పేలవ ఫామ్ కారణంగా వన్డే జట్టు (ODI) నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20 రేసులో వెనుకబడిన పంత్, ఇప్పుడు వన్డేల్లోనూ తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదంలో ఉన్నాడు. ఈ పరిస్థితిని తనకి అనుకూలంగా మార్చుకుంటూ సంజూ శామ్సన్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగుతుండగా, బ్యాకప్ కీపర్ స్థానం కోసం పంత్ కంటే శామ్సన్‌కే ప్రధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మార్పునకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఐపీఎల్ 2026 ఫామ్. రిషబ్ పంత్ ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు (సగటు 27.14). మరోవైపు, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజూ శామ్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 8 మ్యాచ్‌ల్లోనే 304 పరుగులు చేసి, అందులో రెండు సెంచరీలు బాదడం విశేషం. వన్డే ఫార్మాట్‌లో సంజూకు తక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ, అతని రికార్డ్ అద్భుతంగా ఉంది. 14 ఇన్నింగ్స్‌ల్లో 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు.. పంత్ గాయపడిన సమయంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శామ్సన్‌తో పాటు జురెల్ పేరు సైతం రేసులో ఉంది. మరోవైపు.. 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాలని భావిస్తున్నారు. అందుకే మెరుగైన గణాంకాలు ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించాలని చూస్తున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!