IPL 2026 ప్లేఆఫ్స్ రేసు.. ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ పక్కా.. ఈ మ్యాచ్ గెలిస్తే ఆ జట్టుకు టైటిల్ ఖాయమన్న అశ్విన్

Ipl Teams Profits

Ipl Teams Profits

Ashwin Predicts IPL 2026 Playoffs: ఐపీఎల్ 2026 సీజన్ దాదాపు క్లైమాక్స్ దశకు చేరుకుంది. గ్రూప్ స్టేజ్ ముగియడానికి చాలా జట్లకు కేవలం నాలుగైదు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాయింట్ల పట్టికలో కొన్ని జట్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ, అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న జట్టు మాత్రం ఇప్పటివరకు ఏదీ లేదు. ప్రస్తుతం 14 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (13 పాయింట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ (12 పాయింట్లు) ఉన్నాయి. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో ఉండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (9), ఢిల్లీ క్యాపిటల్స్ (8), ముంబై ఇండియన్స్ (6), లక్నో సూపర్ జెయింట్స్ (6) వెనుకంజలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ సమీకరణాలపై భారత మాజీ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్, ఆర్సీబీ జట్లు దాదాపు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నట్లేనని ధీమా వ్యక్తం చేశాడు. “SRH, RCB కచ్చితంగా క్వాలిఫై అవుతాయి. మిగిలిన రెండు స్థానాల కోసం గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గట్టి పోటీ ఉండబోతోంది” అని అశ్విన్ విశ్లేషించాడు. ఐపీఎల్‌లో తన ప్రస్థానాన్ని సీఎస్‌కేతో మొదలుపెట్టి, తన చివరి సీజన్‌ను కూడా అదే జట్టుతో ముగించిన అశ్విన్.. చెన్నై అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. “చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాలి. అదృష్టం మీద ఆధారపడటం పనికిరాదు. ఒకవేళ చెన్నై 16 పాయింట్లతో నిలిచినా.. రాజస్థాన్ తన మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిని ఓడిపోవాలి, అలాగే పంజాబ్ పాయింట్లు కోల్పోవాలి. దీనికి తోడు చెన్నై నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటం కీలకం” అని అశ్విన్ వివరించాడు. నెట్ రన్ రేట్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ.. “చెన్నై తన తర్వాతి రెండు మ్యాచ్‌లను లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిస్తే, వారు కేవలం ప్లేఆఫ్స్ చేరడమే కాదు, 2010లో లాగా ఏకంగా టైటిల్ గెలిచే అవకాశం సైతం ఉంది. ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ ఒక బ్లాక్ బస్టర్ లాంటిదే” అని అశ్విన్ వివరించాడు.