Vaibhav Suryavanshi: అది బుడ్డోడి రేంజ్.. వైభవ్ సూర్యవంశీ కోసం వేలం వ్యూహాన్ని మార్చుకున్న రాజస్థాన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాయల్స్ 15 ఏళ్ల బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో దిగ్గజ బౌలర్లను చితకబాదుతూ భారత క్రికెట్లో సంచలనంగా మారాడు. వైభవ్ క్రీజులో ఉంటే బాల్, బౌలర్ వణకాల్సిందే. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడుతూ గ్రౌండ్ ను హోరెత్తిస్తున్న వైభవ్ ఆటతీరుకి క్రికెట్ వరల్డ్ ఫిదా అయిపోయింది. వైభవ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 10 మ్యాచ్‌లలో 404 పరుగులు సాధించాడు. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లో చేసిన సెంచరీ కూడా ఉంది.
2024 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. వైభవ్ బ్యాటింగ్ చూసిన తర్వాతే రాజస్థాన్ తనని తీసుకోవాలని నిర్ణయించుకుంది. రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్, జుబిన్ భరూచా, వైభవ్ గురించి ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. జట్టు ట్రయల్ క్యాంప్ మొదటి రోజే వైభవ్ చూపిన ప్రభావం ఎంతగా ఉందంటే, ఫ్రాంచైజీ తమ వేలం వ్యూహాన్ని మార్చుకోవలసి వచ్చిందని వివరించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
విస్డెన్ క్రికెట్‌తో మాట్లాడుతూ, నెట్స్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టి వైభవ్ అందరినీ ఆశ్చర్యపరిచాడని భరూచా వెల్లడించారు. “నేను సంజు సామ్సన్, యశస్వి జైస్వాల్ వంటి ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను దగ్గరగా గమనించాను. సంజు తొలి బంతికే సిక్స్ కొట్టాడు, యశస్వి బంతిని తన భుజం మీదుగా ఫ్లిక్ చేశాడు, కానీ వైభవ్ చేసింది వేరే స్థాయిలో ఉంది,” అని ఆయన అన్నారు. ట్రయల్స్ సమయంలో, వైభవ్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ వేసిన ఇన్‌స్వింగింగ్ బంతికి అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. దీని తర్వాత, ఆ ఆటగాడిని మరింత కఠినమైన పరీక్షకు గురిచేయాలని నిర్ణయించారు. ఆటగాళ్లందరినీ పంపించివేసిన తర్వాత, వైభవ్‌ను తిరిగి పిలిపించి, పొడగరి, ఫాస్టెస్ట్ త్రోడౌన్ స్పెషలిస్టులతో వైభవ్ కి పరీక్ష పెట్టారు.
“తన పూర్తి శక్తితో బౌలింగ్ చేయమని నేను బౌలర్ కి చెప్పాను. వైభవ్ ఆరంభంలో కొన్ని బంతులను వదిలేసి, ఆ తర్వాతి బంతిని నేరుగా సైట్‌స్క్రీన్‌పైకి పంపాడు. ఆ క్షణంలోనే ఇతను సాధారణ ఆటగాడు కాదని నేను గ్రహించాను,” అని భరూచా అన్నారు. భరూచా వెంటనే రాజస్థాన్ రాయల్స్ సీఈఓ జాక్ లష్ మెక్‌క్రమ్‌కు ఒక మెసేజ్ పంపారు. “మనకు తరంలో ఒక్కసారి మాత్రమే కనిపించే ఆటగాడు ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత అతనిలాంటి బ్యాట్స్‌మన్‌ను నేను చూడలేదు.” సచిన్ టెండూల్కర్ తర్వాత క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు వైభవే మాత్రమే అని మేసేజ్ లో పేర్కొన్నట్లు తెలిపాడు.
తాజావార్తలు
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!