MI vs SRH: ముంబైకి చావో రేవో.. నేడు హైదరాబాద్ చేతిలో ఓడిపోతే అంతే సంగతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 29) ముంబై ఇండియన్స్(MI), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైకి చాలా ఇపార్టెంట్ కానుంది. ఐదు ట్రోఫీలు కైవసం చేసుకున్న ముంబై జట్టు ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది. నేడు ఫామ్‌లో ఉన్న హైదరాబాద్‌ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అశలు సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఓటమిపాలైతే ఈ సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైపోతాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడిపోయింది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవ్వడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం లీగ్ దశ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్‌లో టాప్-4లో నిలిచే జట్లే ప్లే ఆఫ్స్ చేరుతాయి. దాంతో ఇక నుంచి ముంబై ఇండియన్స్ ఆడబోయే 7 మ్యాచ్‌లకు ఏడూ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం 6 మ్యాచ్‌లైనా గెలిస్తేనే ముంబై ఇండియన్స్‌కు టాప్-4 బెర్త్ ఖరారు అవుతుంది. ఇక ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఈ పోరు జరగనుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇక ముంబై జట్టు విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (97), సూర్యకుమార్ యాదవ్ (110) ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సైతం ఇప్పటివరకు కేవలం 2 వికెట్లే తీసి ఫామ్‌లోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక మరోవైపు.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌లు వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. దీంతో బుమ్రానే ఇన్నింగ్స్ ఆరంభించాల్సి వస్తోంది. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సమస్యతో దూరం కావడం, అతని స్థానంలో వచ్చిన డానిష్ మలేవార్ ప్రభావం చూపకపోవడం ముంబైకి పెద్ద లోటుగా మారింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ పటిష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌పై ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న హైదరాబాద్, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అభి ఇప్పటికే 380 పరుగులు (ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు) సాధించి 212.29 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడుతున్నాడు. ఇషాన్ కిషన్ (312), హెన్రిచ్ క్లాసెన్ (349) సైతం నిలకడగా పరుగులు సాధిస్తున్నారు. కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో తిరిగి రాణించడం హైదరాబాద్‌కు మరింత బలాన్నిస్తోంది. ట్రావిస్ హెడ్ నుంచి జట్టు పెద్ద ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!