Jasprit Bumrah: వేట మొదలైంది.. ఫామ్‌లోకి వచ్చిన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. సీజన్‌లో మొదటిసారిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ‘యార్కర్ కింగ్’ జస్‌ప్రీత్ బుమ్రా తన పంజా విసిరాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో బుమ్రా తన వికెట్ల వేటను ప్రారంభించాడు. ఈ సీజన్‌లో తన తొలి వికెట్‌గా ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను డకౌట్ చేయడం విశేషం.
తొలి బంతికే షాక్
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇన్నింగ్స్ ఆరంభంలోనే బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో గుజరాత్ బ్యాటర్లను వణికించాడు. బుమ్రా వేసిన ఒక అద్భుతమైన డెలివరీని కవర్స్ మీదుగా ఆడేందుకు సాయి సుదర్శన్ ప్రయత్నించాడు. అయితే, బుమ్రా బంతిలోని వేగాన్ని అంచనా వేయడంలో విఫలమైన సుదర్శన్, బ్యాట్ ఎడ్జ్ ఇచ్చాడు. కవర్స్‌లో సిద్ధంగా ఉన్న ఫీల్డర్ క్రిష్ భగత్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సుదర్శన్ ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.
బుమ్రా ఫామ్‌లోకి రావడం ముంబై ఇండియన్స్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రపంచ స్థాయి బ్యాటర్లు సైతం బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి తడబడుతుంటారు. ముఖ్యంగా అతని ‘యూనిక్’ యాక్షన్ , బంతిని రిలీజ్ చేసే పాయింట్‌ను పసిగట్టడం బ్యాటర్లకు కష్టసాధ్యంగా మారుతోంది. బుమ్రా వద్ద ఉన్న స్లోయర్ బాల్స్, యార్కర్లు బ్యాటర్లను క్రీజుకు పరిమితం చేస్తున్నాయి. ఏ సమయంలోనైనా వికెట్లు తీయగల సామర్థ్యం, పరుగులను కట్టడి చేసే నైపుణ్యం అతడిని ప్రమాదకర బౌలర్‌గా మార్చాయి.
ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా ఉన్న బుమ్రా.. మొదటి మ్యాచ్ నుంచి కాస్త ఇబ్బందిగా కనిపించాడు. జీటీ మీద మాత్రం ఈ వికెట్‌తో తన లయను అందుకున్నాడు. గుజరాత్ సొంత మైదానంలో బుమ్రా చేసిన ఈ వినాశనం మ్యాచ్ ఫలితాన్ని శాసించేలా కనిపిస్తోంది. “బూమ్ బూమ్ బుమ్రా” ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ముంబై ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్ల వేట కొనసాగుతుందని జట్టు మేనేజ్‌మెంట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!