Ishan Kishan: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. విక్టరీపై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan: నిన్న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చెన్నై విజయానికి 60 బంతుల్లో 84 పరుగులు చేయాల్సి ఉంది. చెన్నై చేతిలో 7 వికెట్లున్నాయి. అందరూ దాదాపు గెలుపు ఖాయమనుకున్నారు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమే చేసింది. పిచ్, పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్న ఆ జట్టు బౌలర్లు స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో అదరగొట్టారు. బంతి బంతికి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ చెన్నై చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఎట్టకేలకు విజయం సాధించారు. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే విజయం సాధించామని కిషన్ తెలిపాడు.
READ MORE: Miss India 2026 Winner: మతి పోగొట్టేసిన మిస్ ఇండియా.. గోవా సుందరి సాధ్విని వరించిన కిరీటం!
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ విజయం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. తమ టీమ్‌లోకి యంగ్ బౌలర్లు అదరగొట్టారని ప్రశంసించాడు. యువ బౌలర్లు ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తుంటే కెప్టెన్‌కు కలిగే అనుభూతే వేరని చెప్పాడు. తమ టీమ్‌లోని యువ బౌలర్లు స్వయంగా తమ సొంత ప్లాన్స్‌తో వస్తున్నారని.. అద్భుత ప్రణాళికలతోనే బౌలింగ్ చేస్తున్నారని స్పష్టం చేశాడు. దీంతో తనకు ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు. బౌలర్లు ప్రత్యర్థుల కంటే ముందే ఉన్నారు. ఈరోజు వాళ్లు వేసిన బౌలింగ్ తీరు మెచ్చుకోదగినదన్నాడు. తాము సాధారణంగా 30 నుంచి 40 పరుగులు తక్కువ చేశామన్నాడు. “అభిషేక్ త్వరగానే అవుట్ అయ్యాడు. అప్పటికే 60కి పైగా పరుగులు ఉన్నాయి. వాస్తవానికి మా టీమ్ 220, 230 పరుగులు చేసినప్పుడు మా స్టార్ బ్యాటర్లలో ఎవరో ఒకరు అత్యధిక పరుగులు చేస్తారు. కానీ.. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ఆ భారీ ఇన్నింగ్స్ మిస్ అయ్యింది. మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ.. 30-40 పరుగుల తక్కుగానే చేశాం. మా యువ బౌలర్లు ప్రాక్టీస్ సెషన్‌లో చాలా కష్టపడుతున్నారు. జట్టు కెప్టెన్‌గా వారిని నేను పూర్తిగా నమ్ముతున్నాను.” అని ఇషాన్ కిషన్ స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
-
PM Modi: పారిస్‌లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
-
The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
-
BRS Protest: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!