Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరపున విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. కేవలం మూడు మ్యాచ్‌లు మినహా, మిగిలిన అన్నింటా ప్రపంచస్థాయి బౌలర్లయిన జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ వంటి దిగ్గజాలను బౌండరీల అవతలికి పంపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఒకే ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన తీరు అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్-5లో ఉన్న ఈ యువ కెరటం, కేవలం ‘బంతిని మాత్రమే చూడు, బౌలర్‌ను కాదు’ అనే మంత్రాన్ని నమ్ముతాడు. 10 మ్యాచ్‌ల్లోనే 237.64 స్ట్రైక్ రేట్‌తో 404 పరుగులు చేయడం అతని సత్తాను చాటుతోంది.
ఈ అసాధారణ ఫామ్‌లో ఉన్న సూర్యవంశీని అడ్డుకోవడం ఏ బౌలర్‌కైనా సవాలేనని చాట్ జీపీటీ పేర్కొంది. అతడిని కట్టడి చేసేందుకు బౌలర్లు వైవిధ్యమైన ప్రణాళికలు అనుసరించాలని సూచించింది. మొదటగా.. అతనికి విడ్త్ ఇవ్వకుండా బాడీ లైన్లోకి బంతులు వేయడం ముఖ్యం. హార్డ్ లెంగ్త్ బంతులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూనే, మధ్యలో వేగం తగ్గించిన స్లోయర్ బంతులతో అతని టైమింగ్‌ను దెబ్బతీయాలి. వైడ్ యార్కర్లు వేయడం ద్వారా అతడిని బ్యాట్ చాచి ఆడేలా ప్రేరేపించాలి, తద్వారా పాయింట్ లేదా కవర్ లో క్యాచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను శరీరం వైపు సంధిస్తే, అతను ఇబ్బందికరమైన పుల్ షాట్లు ఆడే ప్రమాదం ఉంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
స్పిన్నర్లు అయితే బంతిని గాల్లో ఊగిస్తూ ఆఫ్ స్టంప్‌కు వెలుపల వేయాలి, ఇది అతడిని భారీ షాట్లకు ఊరించి మిస్ టైమ్ అయ్యేలా చేస్తుంది. ఒక ఓవర్ ప్రణాళికను గమనిస్తే, మొదటి రెండు బంతులు ఫోర్త్ స్టంప్ ఛానల్లో వేసి, ఆ తర్వాత ఒక్కసారిగా లోపలికి వచ్చే బంతిని వేయాలి. నాలుగో బంతిని రిబ్స్ లక్ష్యంగా బౌన్సర్ వేసి, ఐదో బంతిని స్లోయర్ డెలివరీగా సంధిస్తే వికెట్ పడే అవకాశం మెండుగా ఉంటుంది. చివరి బంతిని కాలి వేళ్ల దగ్గరికి యార్కర్‌గా వేస్తే, అప్పటికే వెనుకకు తగ్గిన బ్యాటర్ బౌల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యూహాలతోనే సూర్యవంశీ లాంటి విధ్వంసకర బ్యాటర్‌ను పవర్‌ప్లేలోనే పెవిలియన్ పంపగలమని చాట్ జీపీటీ వివరించింది.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!