Daniel Vettori: “పక్కా ప్లాన్‌తో దిగుతున్నాం”.. పంజాబ్ జోరుకు బ్రేక్ వేసేందుకు SRH కోచ్ మాస్టార్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daniel Vettori: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరగనున్న కీలక పోరుకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) హెడ్ కోచ్ డానియల్ వెట్టోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్లు దూకుడుగా ఆడే నైజం ఉన్నవేనని, ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ జోడీల ప్రదర్శనే గెలుపోటములను శాసిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెట్టోరి జట్టు వ్యూహాలను పంచుకున్నారు. పక్కా ప్లాన్‌తో దిగుతున్నాం రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.
పంజాబ్ కింగ్స్ ఓడిపోయిన గత మ్యాచ్‌లను విశ్లేషిస్తే, ఓపెనర్లు విఫలమైనప్పుడే ఆ జట్టు ఒత్తిడిలోకి వెళ్లినట్లు కనిపిస్తోందని వెట్టోరి పేర్కొన్నారు. “పంజాబ్ ఓపెనింగ్ జోడీ చాలా ప్రమాదకరమైనది. మా జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఎలాగైతే మెరుపు ఆరంభాన్ని ఇస్తారో, పంజాబ్‌కు సైతం ఓపెనర్లు అలాగే కీలకం. అందుకే ఆ ఇద్దరు బ్యాటర్లను వీలైనంత త్వరగా కట్టడి చేయడంపైనే మేము దృష్టి సారిస్తున్నాం” అని వెల్లడించారు. పంజాబ్ జట్టు బ్యాటింగ్ శైలి దాదాపు తమ జట్టు లాగే ఉంటుందని, బ్యాటింగ్‌లో చాలా అగ్రెసివ్‌గా ఉంటూ బౌలింగ్‌లో లోపాలను కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారని వెట్టోరి విశ్లేషించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ మ్యాచ్ భారీ స్కోర్లకు వేదికయ్యే అవకాశం ఉందని, ఇలాంటి హై-ప్రెజర్ గేమ్‌లో ఏ జట్టు బౌలర్లు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటారో వారే విజేతలుగా నిలుస్తారని వెట్టోరి ఆశాభావం వ్యక్తం చేశారు. గత పది మ్యాచ్‌ల్లో ఎనిమిది సార్లు తమ బ్యాటింగ్ యూనిట్ అద్భుతంగా రాణించిందని, గతంలో జరిగిన పొరపాట్లను పక్కన పెట్టి మళ్లీ అదే జోరును కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ వంటి వేగవంతమైన టోర్నీల్లో ఓటమి గురించి ఎక్కువ ఆలోచించకుండా, తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టడమే ముఖ్యమని హితవు పలికారు.
ఇక, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో (13 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 ఓటములతో (12 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సన్‌రైజర్స్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడమే కాకుండా పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!