RCB Vs PBKS: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయఢంకా మోగించింది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన 61వ మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రస్తుత సీజన్లో అధికారికంగా ప్లేఆఫ్స్ (Playoffs) బెర్త్‌ను ఖరారు చేసుకున్న మొట్టమొదటి జట్టుగా బెంగళూరు రికార్డు సృష్టించింది. మరోవైపు ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ టోర్నీలో వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది.
మొదట బ్యాటింగ్‌లో ఆర్సీబీ విధ్వంసం..
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ 40 బంతుల్లో 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అదరగొట్టగా, ఓపెనర్ విరాట్ కోహ్లీ (58) బాధ్యతాయుత అర్ధసెంచరీతో రాణించాడు. దేవదత్ పడిక్కల్ (45), ఆఖర్లో టిమ్ డేవిడ్ (28) వేగంగా ఆడటంతో పంజాబ్ ముందు కొండంత లక్ష్యం నమోదైంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
బౌలింగ్‌లోనూ బెంగళూరు జోరు..
223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టును ఆర్సీబీ బౌలర్లు ఆరంభంలోనే దెబ్బకొట్టారు. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (0), ప్రభ్సిమ్రాన్ సింగ్ (2)లను భువనేశ్వర్ కుమార్ తక్కువ పరుగులకే అవుట్ చేశాడు. ఆ తర్వాత కూపర్ కానల్లీ (37), సూర్యాంశ్ శెడ్గే (35), మార్కస్ స్టోయినిస్ (37) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
మిడిల్ ఓవర్లలో శశాంక్ సింగ్ కేవలం 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లతో పంజాబ్ నడుము విరచగా, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో ఆర్సీబీ క్యాంప్‌లో ప్లేఆఫ్స్ సంబరాలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?