RR VS MI: ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన 69వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ (MI)పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో తమ 14 లీగ్ మ్యాచ్‌లలో 8 విజయాలు, 6 ఓటములతో మొత్తం 16 పాయింట్లు సాధించి అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 4 బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే (డకౌట్) జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధీర్ (6) కూడా ఆర్చర్ వేటకే బలయ్యాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (12), తిలక్ వర్మ (3) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ముంబయి 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. ఆయన 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేసి నాండ్రే బర్గర్ బౌలింగ్‌లో ఆయనకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ 18 బంతుల్లో 33 పరుగులు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 34 పరుగులు చేసి వేగంగా ఆడినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. చివరలో కార్బిన్ బోష్ (2), దీపక్ చాహర్ (8) వికెట్లు సమర్పించుకోగా, శార్దూల్ ఠాకూర్ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మలు ముంబయి బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసి తమ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించారు.
మే 26 (క్వాలిఫైయర్ 1): పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ధర్మశాలలోని హెచ్పీసీఏ (HPCA) స్టేడియంలో తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది.
మే 27 (ఎలిమినేటర్): పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో తలపడనున్నాయి. ఇందులో ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది.
మే 29 (క్వాలిఫైయర్ 2): క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ముల్లన్పూర్ వేదికగానే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో తలపడుతుంది.
మే 31 (ఫైనల్): క్వాలిఫైయర్ 1 మరియు క్వాలిఫైయర్ 2 విజేతల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తాజావార్తలు
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
-
CM Revanth Reddy : సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్‌ను కూడా తీసుకురండి
-
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
-
Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?