IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్‌ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో 40 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సీజన్‌లో లక్నోకు ఇది వరుసగా నాలుగో ఓటమి. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ప్లేఆఫ్స్ ఆశలు క్లిష్టమవుతున్న తరుణంలో.. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
సంజీవ్ గోయెంకా అండ..
సాధారణంగా జట్టు వరుసగా ఓడిపోతుంటే యజమానులు అసహనానికి గురవుతుంటారు. కానీ, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సంజీవ్ గోయెంకా తన జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ వద్దకు వెళ్లి చాలా సేపు మాట్లాడారు. ఆయన పంత్‌ను ఆప్యాయంగా హత్తుకుని, ధైర్యం చెప్పారు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఓనర్ ఇలా కెప్టెన్‌కు అండగా నిలవడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. గతంలో విమర్శలు ఎదుర్కొన్న గోయెంకా, ఇప్పుడు తనలో వచ్చిన మార్పుతో అందరి మనసులు గెలుచుకున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Rishabh Pant hugging Sanjiv Goenka. ❤️ pic.twitter.com/2FLvsKfi51
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2026
మ్యాచ్ విషయానికి వస్తే..
ఈ మ్యాచ్‌లో లక్నో బౌలర్లు మొహమ్మద్ షమీ, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా రాణించి రాజస్థాన్‌ను 160 పరుగులకే పరిమితం చేశారు. అయితే, బ్యాటర్లు మాత్రం ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయారు. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో, కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (55) ఒంటరి పోరాటం చేసినా, ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ డకౌట్ అవ్వడం జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది.
ఓటమి అనంతరం పంత్ చాలా నిరాశగా కనిపించాడు. తమ బ్యాటింగ్ వైఫల్యమే ఈ ఓటమికి ప్రధాన కారణమని అతను ఒప్పుకున్నాడు. “మా బౌలర్లు అద్భుతమైన పని చేశారు, కానీ బ్యాటింగ్ యూనిట్ గా మేము విఫలమయ్యాము. నేను కూడా బాధ్యతారాహిత్యంగా ఆడాను. మనం సమస్యలకు బయట ఎక్కడో కాకుండా, మన జట్టులోనే పరిష్కారాలు వెతుక్కోవాలి” అని పంత్ పేర్కొన్నాడు.
అయితే.. పంత్ ఇంకా ఆశలు వదులుకోలేదు. తమ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని, తదుపరి మ్యాచ్‌ల్లో పుంజుకుని టోర్నీలో నిలబడతామని ధీమా వ్యక్తం చేశాడు. అటు ఓనర్ మద్దతు, ఇటు కెప్టెన్ పట్టుదల చూస్తుంటే లక్నో త్వరలోనే విజయాల బాట పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!