Site icon NTV Telugu

RCB vs GT: చితక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్

Gt Vs Rcb

Gt Vs Rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా నేడు (ఏప్రిల్ 24) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 03 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్సీబీకి 206 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. సుదర్శన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, ఈ మ్యాచ్‌లో అత్యంత వేగంగా పరుగులు చేసిన ఐపీఎల్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడిన సుదర్శన్ ఆర్సీబీ బౌలర్లకు చెమటలు పట్టించాడు. గిల్ (32), సాయి తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గుజరాత్ కెప్టెన్ సుయాష్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

మరోవైపు, సాయి కేవలం 57 బంతుల్లోనే తన మూడవ ఐపీఎల్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో అతనికి ఇది తొలి శతకం కాగా, ఐపీఎల్ కెరీర్‌లో మూడోది. అయితే, సెంచరీ చేసిన తర్వాత సుదర్శన్ జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. డెత్ ఓవర్లలో జోస్ బట్లర్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అంచనా వేయగా, 25 పరుగుల వద్ద భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

Exit mobile version