Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్‌కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruturaj Gaikwad: ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరిస్థితి దారుణంగా మారింది. పేలవ ప్రదర్శనతో ఈ ప్లేఆఫ్స్ ఆశలు గల్లతయ్యాయి. ఇక, శనివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ అనంతరం జట్టు వ్యూహాలు, ఆటగాళ్ల ప్రదర్శనపై కీలక విషయాలను పంచుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన యంగ్ సెన్సేషన్ కార్తీక్ శర్మపై గైక్వాడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కార్తీక్ కేవలం సిక్సర్లు కొట్టే హిట్టర్ మాత్రమే కాదని, బౌలర్లను ఎంచుకుని తెలివిగా ఆడే సత్తా ఉన్న ఆటగాడని కొనియాడాడు. నాలుగో స్థానంలో అతను బ్యాటింగ్‌కు రావడం వల్ల జట్టుకు మంచి సమతుల్యత దక్కిందని, ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంతో పాటు స్పిన్నర్లపై విరుచుకుపడగలడని నమ్మకం వ్యక్తం చేశాడు. లెజెండరీ క్రికెటర్ మైక్ హస్సీ (Mr. Cricket) చెప్పినట్లుగా.. కార్తీక్ ఫామ్ అందుకుంటే రాబోయే ఏళ్లలో జట్టుకు మరిన్ని విజయాలు అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అలాగే.. అకీల్ హొస్సేన్‌ను పక్కన పెట్టడం వెనుక ఉన్న వ్యూహాన్ని కూడా గైక్వాడ్ వివరించాడు. జట్టు బ్యాటింగ్ పటిష్టం చేయడానికి 8వ స్థానంలో ఒక బ్యాటర్ అవసరమని భావించాం, అందుకే యువ ఆటగాళ్లు వీర్, ఘోష్‌లకు అవకాశం ఇచ్చామని చెప్పాడు. ప్రాక్టీస్ సెషన్లలో అద్భుతంగా రాణించిన వీరిద్దరూ బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు సిక్సర్లు సైతం కొట్టగలరని, అందుకే వారిని జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. ఇక తన వ్యక్తిగత ఫామ్ గురించి మాట్లాడుతూ.. మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండి గెలిపించడం చాలా సంతృప్తిని ఇచ్చిందని గైక్వాడ్ పేర్కొన్నాడు. టీ20 క్రికెట్‌లో ఒక్కోసారి మంచి షాట్లు ఆడినా అవుట్ అవుతుంటామని, కానీ తాను ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతోనే ఉన్నానని చెప్పాడు. ఈ కష్టకాలంలో తన భార్య, సహచర ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్ తనను ఎంతో పాజిటివ్‌గా ఉంచారని కృతజ్ఞతలు తెలిపాడు. చివరిగా అభిమానుల గురించి ప్రస్తావిస్తూ.. “మా కోసం రాత్రింబవళ్లు మైదానానికి వస్తున్న ఫ్యాన్స్ కోసం ఈ జెర్సీ మీద గౌరవంతో మా 100 శాతానికి మించి కష్టపడతాం. తప్పులు జరిగినా వాటి నుంచి కోలుకుని బలంగా తిరిగి వస్తాం” అని అభిమానులకు మాటిచ్చాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!