Site icon NTV Telugu

Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!

Abhi

Abhi

Abhishek Sharma: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ భారీ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో అభిషేక్ 22 బంతుల్లో 59 పరుగులు చేసి తన ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. దూకుడుగా ఆడిన ఈ ఓపెనర్, ఈ ఇన్నింగ్స్‌లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లు బాదాడు. ఆఫ్-స్పిన్నర్ మాథ్యూ షార్ట్‌ వేసిన ఓవర్‌లో అలవోకగా పరుగులు సాధించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా (తక్కువ బంతుల్లో) 2000 పరుగుల మైలురాయిని అందుకున్న భారతీయ ఆటగాడిగా వీరేందర్ సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు.

READ MORE: Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ అక్కడ కూడా ఫ్లాపేనా?

ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్, భారత ప్రతిష్టాత్మక లీగ్‌(IPL)లో 2000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న భారత ఆటగాడిగా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. సెహ్వాగ్‌కు ఈ మైలురాయిని చేరుకోవడానికి 1194 బంతులు అవసరమయ్యాయి. మరోవైపు, 1120 బంతుల్లో ఈ ఘనతను సాధించిన ఆండ్రీ రస్సెల్ ఆల్-టైమ్ రికార్డును అభిషేక్ అందుకోలేకపోయాడు. ఇక అభిషేక్ కంటే ముందు ఆండ్రీ రసెల్ ఉన్నాడు.

READ MORE: Mahesh Babu: రాజమౌళి మహేశ్‌కు పాస్‌పోర్ట్‌ ఇచ్చేశాడా?

ఐపీఎల్‌లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు:
ఆండ్రీ రసెల్ – 1120 బంతులు
అభిషేక్ శర్మ – 1193 బంతులు
నికోలస్ పూరన్ – 1198 బంతులు
వీరేందర్ సెహ్వాగ్ – 1211 బంతులు
క్రిస్ గేల్ – 1251 బంతులు

Exit mobile version