AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AB de Villiers: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం, ఐపీఎల్ లెజెండ్ ఏబీ డివిలియర్స్.. వైభవ్ ఆటతీరును ఆకాశానికెత్తాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఉన్న ‘గేమ్ అవేర్నెస్’ (మ్యాచ్‌పై అవగాహన) తనను ఎంతగానో ఆకట్టుకుందని జియోస్టార్ (JioStar) టాక్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ లాంటి హై-ప్రెషర్ నాకౌట్ మ్యాచ్‌లో వైభవ్ చూపించిన పరిణతి, ప్రశాంతత అసాధారణమైనవని డివిలియర్స్ కొనియాడాడు. “సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఎన్ని రకాల ప్లాన్లు వేసినా, పదే పదే ఫీల్డింగ్ మారుస్తూ లెంత్ బాల్స్ వేసి వైభవ్ రిథమ్‌ను దెబ్బతీయాలని చూసినా.. అతడు మాత్రం ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా తన శైలిలోనే ఆడాడు. ఆ వయసులో ఆ స్థాయి ఏకాగ్రత, పట్టుదల చూపించడం నిజంగా అద్భుతం” అని డివిలియర్స్ అన్నాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే హైదరాబాద్ బౌలింగ్ లైనప్‌ను వైభవ్ పూర్తిగా కట్టడి చేశాడు. పాట్ కమిన్స్ రక్షణాత్మక ఫీల్డింగ్ పెట్టి, యార్కర్లతో కట్టడి చేయాలని చూసినా.. ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన భయం తెలియని షాట్లతో దీటుగా బదులిచ్చాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కేవలం 8 ఓవర్లలోనే 125 పరుగుల భారీ స్కోరుకు చేరుకుంది. చివరకు రాజస్థాన్ 47 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించి క్వాలిఫైయర్-2 కు దూసుకెళ్లింది. ఇక, వైభవ్ బ్యాటింగ్ శైలితో పాటు మ్యాచ్‌కు ముందు అతడు అనుసరించే విధానాలు, మానసిక సన్నద్ధత (మెంటల్ రూటీన్స్) పై కూడా ఏబీడీ ముగ్ధుడయ్యాడు. బౌలర్లను ముందే స్టడీ చేయడం, మ్యాచ్ పరిస్థితులను ఊహించుకోవడం (విజువలైజేషన్) లాంటి విషయాల గురించి వైభవ్ మాట్లాడటం చూస్తే.. ఆ వయసు ప్లేయర్‌కు ఉండాల్సిన దానికంటే ఎక్కువ మెచ్యూరిటీ కనిపించిందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఈ క్రమంలోనే వైభవ్ విజువలైజేషన్ అలవాటును ఆస్ట్రేలియా ఓపెనింగ్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌తో డివిలియర్స్ పోల్చాడు. “మ్యాచ్‌కు ముందు పిచ్‌పై కాసేపు గడుపుతూ మ్యాచ్‌ను ఊహించుకునే మాథ్యూ హేడెన్ రోజులను వైభవ్ నాకు గుర్తుచేశాడు. భవిష్యత్తులో ఈ అలవాట్లు ఇంకా మారవచ్చు, కానీ ఎవరినో కాపీ కొట్టకుండా తనకంటూ ఒక సొంత శైలిని, అలవాట్లను ఇప్పుడే అలవర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లు తమకు ఏది సెట్ అవుతుందో ముందే గుర్తిస్తారు.. వైభవ్ కూడా తన ప్రయాణం మొదట్లోనే ఆ విషయాన్ని గ్రహించాడు” అని ప్రశంసించాడు.
తాజావార్తలు
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!