Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!
- ఢిల్లీ క్యాపిటల్స్‌పై సంజు శాంసన్ అద్భుత శతకం
- 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115
- ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజు శాంసన్ అద్భుత శతకం బాదాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన సంజు.. ఎట్టకేలకు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్‌గా నిలిచాడు. అద్భుత సెంచరీతో మెరిసిన సంజు మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిని కలిశా అని, సెంచరీ చేశా అని చెప్పాడు. మ్యాచ్‌కు ముందు రవిశాస్త్రిని కలవడం తనకు అదృష్టంగా మారిందని, ప్రతి మ్యాచ్‌కు ముందు ఆయనను కలిస్తే బాగుంటుందని సరదాగా చెప్పుకొచ్చాడు.
సంజు శాంసన్ మాట్లాడుతూ… ‘ఎంత ఫామ్‌లో ఉన్నా, దేశం కోసం అన్ని మ్యాచ్‌లు గెలిపించినా రెండు మూడు ఫెయిల్యూర్లు వచ్చినప్పుడు మనసులో సందేహాలు వస్తాయి. అలాంటి సమయంలో నేను మళ్లీ నా బేసిక్స్‌కి వెళ్లాలని నిర్ణయించుకుంటా. నా మీద నమ్మకం ఉంచుకుని, నా సహజ శైలి ఆటనుఆడాను. ప్రారంభంలో దూకుడుగా ఆడాలా? లేదా గేమ్ ప్లాన్ మార్చాలా? అనే ఆలోచనలు వచ్చాయి. కానీ నా బేసిక్స్‌కి కట్టుబడి ఉండటం వల్లే ఈరోజు మంచి ఫలితం వచ్చింది’ అని చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
పిచ్ పరిస్థితుల గురించి కూడా సంజు వివరించాడు. ‘మ్యాచ్ ఆరంభంలో పిచ్ కొంచెం స్లోగా అనిపించింది. కొత్త బంతితో కొంత గ్రిప్ కూడా కనిపించింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ పవర్‌ప్లేలో బౌలింగ్ చేసినప్పుడు బంతి కాస్త ఆగింది. కానీ బంతి పాతబడిన తర్వాత బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా మారింది. ఈ పిచ్ సిద్ధం చేసిన క్యూరేటర్‌కు ధన్యవాదాలు. ఆయుష్‌తో బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను అద్భుతమైన ఆటగాడు. మా ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. అది జట్టుకు చాలా ఉపయోగపడింది’ అని చెప్పుకొచ్చాడు.
సంజు శాంసన్ టార్గెట్ గురించి మాట్లాడుతూ… ‘ఇప్పటి క్రికెట్లో ముందుగానే టార్గెట్ నిర్ణయించడం చాలా కష్టం. ఒకసారి క్రీజ్‌లో సెటిల్ అయితే.. ఎంత పెద్ద స్కోర్ సాధ్యమైతే అంత చేయాలనే ఆలోచనతో ఆడాలి. మా బ్యాటింగ్ లైనప్ బాగుంది. అందుకే బౌలర్లను ఎంచుకుని దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాం. ఈ స్కోర్ చాలెంజింగ్‌గా ఉంటుంది. మాకు మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. పవర్‌ప్లేలో బాగా బౌలింగ్ చేస్తే మ్యాచ్‌ను కంట్రోల్ చేయగలం’ అని ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!