IPL 2026 Playoffs Scenario: ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్.. టాప్‌లో ఆర్సీబీ.. 8 జట్ల అవకాశాలు ఇలా!
- ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్
- ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై, లక్నో
- టాప్-4 కోసం పోటీలో ఇంకా 8 జట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Playoffs Scenario: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ప్లేఆఫ్స్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠభరిత విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయే పరిస్థితి నుంచి బయటపడింది. ముంబైపై చివరి ఓవర్లో 15 పరుగులు చేసి గెలిచిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. వరుస ఓటములను ఎదుర్కొన్న ముంబై, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయినప్పటికీ ఇంకా 8 జట్లు టాప్-4 కోసం పోటీలో ఉన్నాయి.
అగ్రస్థానంలో ఆర్సీబీ:
ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో ఆర్సీబీ అగ్రస్థానంలో ఉంది. +1.103 నెట్ రన్‌రేట్‌తో ఇతర జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే ఇంకా రెండు విజయాలు అవసరం. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్‌కు సరిపోతాయి కాబట్టి ఒక విజయం కూడా సరిపోతుంది. ఇక ఆర్సీబీ మిగిలిన మ్యాచ్‌లన్నీ గెలిస్తే టాప్-2లో నిలిచి క్వాలిఫయర్-1కు నేరుగా అర్హత సాధించే అవకాశం ఉంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
హైదరాబాద్ రెండు గెలిస్తే:
సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్‌రేట్ (+0.737)లో ఆర్సీబీ కంటే వెనుకబడి ఉంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. మే 22న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ టాప్-2 స్థానాలపై కీలక ప్రభావం చూపే అవకాశముంది. గుజరాత్ టైటాన్స్ కూడా 14 పాయింట్లతో పోటీలో ఉంది. అయితే వారి నెట్ రన్‌రేట్ (+0.228) తక్కువగా ఉండటంతో మరో రెండు విజయాలు అవసరం. మే 12న ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్ గుజరాత్‌కు కీలకంగా మారనుంది.
అనుకూల స్థితిలో పంజాబ్:
పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అత్యంత అనుకూల స్థితిలో ఉన్న జట్టుగా కనిపిస్తోంది. 10 మ్యాచ్‌ల్లోనే 13 పాయింట్లు సాధించిన పంజాబ్.. ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో రెండు గెలిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ దాదాపు ఖాయం చేసుకుంటుంది.
చెన్నైకి కనీసం రెండు విజయాలు:
ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం కఠిన పరిస్థితుల్లో ఉంది. సీఎస్కే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలవాల్సిన అవసరం ఉంది. అయితే వారి నెట్ రన్‌రేట్ (+0.185) పెద్దగా మెరుగ్గా లేకపోవడంతో అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే అవకాశం ఉంది.
ఒత్తిడిలో రాజస్థాన్:
రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో సీఎస్కేతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్‌రేట్ (+0.082) తక్కువగా ఉంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు చవిచూడడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. సీఎస్కేతో కలిసి నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం రాజస్థాన్ పోరాడే అవకాశం ఉంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లన్నీ గెలిస్తేనే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ ఆశలు నిలుస్తాయి. ఒక్క ఓటమి ఎదురైనా కేకేఆర్ దాదాపు ఇంటికి వచ్చేస్తుంది.
కఠినంగా ఢిల్లీ పరిస్థితి:
ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి గణితపరంగా మాత్రమే ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం వారి నెట్ రన్‌రేట్ (-1.154) దారుణంగా ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్‌లు భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాలి.
ముంబై, లక్నో అవుట్:
ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పోరు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!