IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!
- ఒకే రోజు రెండు జట్లు ఇంటికి
- ఐపీఎల్ 19వ సీజన్‌లో టాప్ లేపిన ఆర్సీబీ
- ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరాటాలు టోర్నీ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఒకే రోజు రెండు జట్లకు చుక్కెదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలయ్యాయి. ఈ ఓటములతో ముంబై, లక్నో జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో బెంగళూరు టాప్ లేపగా.. చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సులువు చేసుకుంది.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్ల నష్టానికి 166 పరుగులకే పరిమితం అయింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీ చేయగా.. నమన్ ధీర్ (47) రాణించాడు. ఎంఐ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ చివరి బంతికి 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్య వీరోచిత పోరాటం చేశాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడి 73 పరుగులతో అర్ధ శతకాన్ని నమోదు చేసి జట్టును గెలిపించాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఈ విజయంతో ఆర్సీబీ 7 విజయాలను తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఈ సీజన్‌లో 8వ ఓటమిని చవిచూసిన ముంబై కథ ముగిసింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది. ఈ ఓటమితో లక్నో కూడా టోర్నీలో ఎనిమిదో ఓటమిని నమోదు చేసింది. ఫలితంగా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఇకపై ముంబై, లక్నో జట్ల పోరాటాలు నామమాత్రమే. ఒకే రోజు రెండు బలమైన జట్లు ఇంటిబాట పట్టడంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. కేకేఆర్, ఢిల్లీ టీమ్స్ అధికారికంగా నిశక్రమించకున్నా.. రేసులో లేనట్లే. ప్లేఆఫ్స్ రేసులో ఇప్పుడు 6 టీమ్స్ (బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్, పంజాబ్, చెన్నై, రాజస్థాన్) ఉన్నాయి. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి టాప్-4లో నిలవాలని ఆరు టీమ్స్ గట్టి పట్టుదలతో ఉన్నాయి.
తాజావార్తలు
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!