RCB vs GT Final: ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఐపీఎల్ 2026 విజేత ఎవరు?.. పూర్తి వివరాలు ఇవే!
- మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2026 ఫైనల్
- ఐపీఎల్ 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు
- అర్ధరాత్రి 12.50 నిమిషాలు లాస్ట్
- చరిత్ర సృష్టించేందుకు సిద్దమైన పాటీదార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Who Wins If RCB vs GT IPL 2026 Final Is Washed Out: ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), మాజీ విజేత గుజరాత్ టైటాన్స్ (జీటీ) టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండో ఐపీఎల్ ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి తొలి టైటిల్ గెలిచిన ఆర్సీబీ.. ఇప్పుడు వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలని చూస్తోంది. మరోవైపు 2022లో అరంగేట్ర సీజన్లోనే కప్పు గెలిచిన గుజరాత్.. ఐదేళ్లలో మూడోసారి ఫైనల్‌కు చేరి మరో టైటిల్‌పై కన్నేసింది.
ఫైనల్‌కు వర్షం ముప్పు:
వాతావరణ నివేదికల ప్రకారం.. అహ్మదాబాద్‌లో మ్యాచ్ రోజు వర్షం కురిసే అవకాశాలు తక్కువ. మ్యాచ్ జరిగే సమయంలో 30 శాతం వర్ష సూచన ఉండగా.. మేఘావృత పరిస్థితులు కూడా 15 శాతం మేర ఉన్నాయి. క్వాలిఫయర్-2 అనంతరం చండీగఢ్ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణం ఉత్తర-పశ్చిమ భారతదేశంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆలస్యమైనప్పటికీ.. ఫైనల్ రోజున అహ్మదాబాద్‌లో వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే:
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లోని క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. ఫైనల్‌కు మాత్రం బీసీసీఐ రిజర్వ్ డేను కేటాయించింది. ఆదివారం మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాల వల్ల పూర్తికాకపోతే.. సోమవారం (జూన్ 1) రిజర్వ్ డేలో మ్యాచ్ కొనసాగుతుంది. ఈరోజు మ్యాచ్ ప్రారంభమై మధ్యలో ఆగిపోతే.. సోమవారం అదే స్కోరు, అదే ఓవర్, అదే బంతి నుంచి ఆటను పునఃప్రారంభిస్తారు. మ్యాచ్‌ను తిరిగి మొదటి నుంచి నిర్వహించరు.
అర్ధరాత్రి 12.50 నిమిషాలు లాస్ట్:
ఈరోజు మ్యాచ్ నిర్వహించేదుకు అన్ని అవకాశాలను అంపైర్లు పరిలిశీలిస్తారు. సమయం మించి పోతుంటే ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహిస్తారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరగాలంటే కటాఫ్ టైం రాత్రి 11.45 నిముషాలు. 5 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. అర్ధరాత్రి 12.50 నిమిషాల లోపు కనీసం సూపర్ ఓవర్ ద్వారా విజేతను తేల్చేందుకు ట్రై చేస్తారు. అప్పటికి వెదర్ అనుకూలించకపోతే.. మ్యాచ్ రిజర్వ్ డేకు వెళుతుంది.
రిజర్వ్ డే కూడా వర్షానికి బలైతే:
ఆసక్తికర అంశం ఏంటంటే ఒకవేళ ఆదివారం మాత్రమే కాదు, రిజర్వ్ డే సోమవారం కూడా వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా నిలుస్తుంది. లీగ్ దశలో గుజరాత్ కంటే ఆర్సీబీ మెరుగైన స్థానంలో నిలవడమే ఇందుకు కారణం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఫైనల్ నిర్వహించడం అసాధ్యమైతే, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం దక్కించుకున్న జట్టు విజేతగా నిలుస్తుంది.
ఫైనల్‌కు ఎలా చేరుకున్నాయి:
ఆర్సీబీ క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. క్వాలిఫయర్-1 ఓటమి తర్వాత మరో అవకాశం పొందిన జీటీ.. క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
చరిత్ర సృష్టించేందుకు సిద్దమైన పాటీదార్:
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్‌కు ఈ ఫైనల్ ప్రత్యేకం. ఒకవేళ బెంగళూరు విజయం సాధిస్తే.. వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన మూడో కెప్టెన్‌గా పాటీదార్ చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఈ ఘనతను చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే సాధించారు. ఇప్పుడు అందరి దృష్టి అహ్మదాబాద్‌పై ఉంది. మ్యాచ్ జరుగుతుందా?, వర్షం అడ్డుకుంటుందా?, ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ గెలుస్తుందా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!