టీ20 క్రికెట్ అంటేనే రసవత్తర పోరాటాలకు కేరాఫ్ అడ్రెస్.. అలాంటిది ఇక ఐపీఎల్ అంటే ఆ మజానే వేరు.. దాని గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటీ. గత 15 సీజన్ల నుంచి హోరాహోరీగా మ్యాచ్ లు.. ఊహించని మలుపులు.. కళ్లు తిప్పుకోనివ్వని ఉత్కంఠ క్షణాలు.. చివరి నిమిషం వరకు సాగే పోరాటాలు.. నిమిషాల్లో మారే ఫలితాలు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అసలు సిసలైన మజా ఇవాళ ప్రారంభం కాబోతుంది. ఈ 16వ సీజన్ లో తొలి పోరులో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే గతేడాది తమ తొలి సీజన్ లో ఛాంపియన్ గా అవతరించిన గుజరాత్ టైటాన్స్ ఈ సారి లీగ్ లోనూ విజయాన్ని కొనసాగించాలని భావిస్తుంది. అలాగే గత సీజన్ లో గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లిన సీఎస్కే ఈసారి ఎలాగైన కప్ కొట్టాలని పట్టుదలతో ఉంది. అలా ధోనీ కెప్టెన్సీ లో సీఎస్కే-హార్ధిక్ పాండ్యా గుజరాత్.. రెండు జట్లు బరిలోకి దిగబోతున్నాయి.
Also Read : JP Nadda : జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన రద్దు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తొలి మ్యాచ్ కు ముందే షాక్ తగిలింది. ప్రాక్టీస్ మ్యాచ్ లో ధోనీ గాయపడ్డాడు. అతడు ఆడేది అనుమానంగా మారింది. ఓపెనర్లుగా డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ లు ఆడే అవకాశం ఉంది. మూడో స్థానంలో బెన్ స్టోక్స్ దిగొచ్చు. జడేజా, మొయిన్ ఆలీ, శివమ్ దూబే.. ఇలా జట్టులో నలుగురు ఆల్ రౌండర్ లు ఉన్నారు. అయితే తొలి మ్యాచ్ లో బెన్ స్టోక్స్ బౌలింగ్ చేసేది అనుమానమే.. ఇక బౌలర్లలో దీపక్ చాహర్, సిమ్రన్ జీత్ సింగ్, డ్వేన్ ప్రిటోరియస్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత సీజన్ లో బాగా రాణించిన యువ పేసర్ ముఖేశ్ చౌదరి గాయంతో దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆకాశ్ సింగ్ ను ఎంపిక చేశాడు. బ్యాటింగ్ లో అంబటి రాయుడుతో జట్టు బలంగా ఉంది.
Also Read : Pawan Kalyan : రాష్ట్రంలో రైతులు కష్టాలు మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి
గుజరాత్ జట్టులో శుభ్ మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతడు, సాహా ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఓపెనర్ గా బరిలోకి దిగాల్సిన డేవిడ్ మిల్లర్.. అంతర్జాతీయ మ్యాచ్ లు ఉన్న కారణంగా అతడు కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. దీంతో మ్యాథ్యూ వేడ్ కు అవకాశం దక్కొచ్చు. కేన్ విలియమ్సన్ గుజరాత్ తరపు ఆరంగ్రేటం చేసే అవకాశం ఉంది. హార్థిక్ పాండ్యా, తెవాటియాలతో బ్యాటంగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్, షమీ, సాయికిషోర్, అల్జారీ జోసెఫ్ లు కీలకంగా ఉన్నారు. ఒకవేళ అల్జారీ జోసెఫ్ ను ఆడించకపోతే జాష్ లిటిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే గతేడాది మెగాటోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన గుజారాత్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన రెండు మ్యాచ్ లు గెలిచింది.
Also Read : Pawan Kalyan : జనసేన నేతల దీక్షను భగ్నం చేసిన తీరు ఆక్షేపణీయం
ఇక పోతే ఇవాళ జరిగే తొలి పోరులో నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ మ్యాచ్ సాగే కొద్దీ.. స్పన్నర్లు ప్రభావవంతంగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడి పిచ్ పై తొలి ఇన్సింగ్స్ సగటు స్కోర్ 170 పరుగులు చేసే ఛాన్స్ ఉంది. ఎక్కువగా ఛేజింగ్ చేసే జట్టు ఇక్కడ విజయాలను నమోదు చేస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమలులోకి రానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ఓపెనింగ్ కు ఆడిపాడే స్టార్స్ లిస్ట్ లో కి దక్షిణాది హీరోయిన్ రష్మక చేరింది. ఐపీఎల్ యాజమాన్యం ఆమె ప్రదర్శన గురించి తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మరపురాని సాయంత్రం కోసం సిద్దంగా ఉండండి. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో రష్మి్క, తమన్నా భాటియా పాల్గొననున్నారు.