IPL Historic Day: బ్యాట్స్‌మెన్‌ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్‌లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!
- ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజుగా ఏప్రిల్ 25
- బ్యాట్స్‌మెన్‌ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్‌లు
- అభిమానులకు అసలైన రన్ ఫెస్టివల్‌గా మ్యాచ్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 ఏప్రిల్ 25.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చారిత్రాత్మక రోజుగా నిలిచిపోయింది. రెండు మ్యాచ్‌లు, బ్యాట్స్‌మెన్‌ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు స్థాయి ఛేజింగ్‌లు, వ్యక్తిగత ప్రదర్శనలు.. అన్నీ కలిసొచ్చి అభిమానులకు మరచిపోలేని అనుభూతిని అందించాయి. ఢిల్లీ క్యాపిటల్స్vs పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డ ఈ రెండు మ్యాచ్‌లు అభిమానులకు అసలైన రన్ ఫెస్టివల్‌గా మారాయి.
మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 152 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా నితీష్ రాణా 91 పరుగులు బాదాడు. కానీ ఈ భారీ స్కోర్ కూడా ఢిల్లీకి విజయంను అందించలేకపోయింది. పంజాబ్ కింగ్స్ అసాధారణంగా ఆడుతూ కేవలం 18.5 ఓవర్లలోనే 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రభసిమ్రాన్ సింగ్ (76), శ్రేయాస్ అయ్యర్ (71), ప్రియాన్ష్ ఆర్య (43) జట్టుకు అద్భుత విజయం అందించారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 228 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా కేవలం 18.3 ఓవర్లలోనే 229 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లో 103 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఇషాన్ కిషన్ (74), అభిషేక్ శర్మ (57) అద్భుతంగా ఆడారు. శనివారం నమోదైన రికార్డులు ఐపీఎల్ స్థాయిని మరోసారి చాటాయి. 265 పరుగుల లక్ష్యాన్ని తొలిసారిగా విజయవంతంగా ఛేదించడం, ఒకే రోజులో రెండు 220+ ఛేజింగ్‌లు జరగడం వంటి అరుదైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తక్కువ వయసులోనే సెంచరీలు బాదుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఐపీఎల్ ఎందుకు ప్రపంచంలోనే నంబర్ వన్ లీగ్ అనిపిస్తుందో మరోసారి నిరూపించింది.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!