Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
- హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్
- ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన హార్దిక్
- మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya has been fined by BCCI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు హార్దిక్‌పై కఠిన చర్యలు తీసుకుంది. అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో హార్దిక్ చేసిన అతి కారణంగా బీసీసీఐ చర్యలు తీసుకుంది.
బౌలింగ్‌కు సిద్ధమవుతూ తన రన్అప్ వైపు వెళ్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా కోపంతో వికెట్‌పై ఉన్న బెయిల్స్‌ను బలంగా కొట్టేశాడు. దీనిని ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘనగా పరిగణించారు. ఈ ఆర్టికల్ ప్రకారం.. మ్యాచ్ సమయంలో క్రికెట్ సామగ్రి, మైదాన పరికరాలు లేదా ఇతర వస్తువులను దుర్వినియోగం చేయడం నేరంగా పరిగణిస్తారు. హార్దిక్‌పై లెవల్-1 నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు.
Also Read
- IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
- Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
- Rohit Sharma: ఇదో చెత్త సీజన్, నేను ఇంకా చెత్తగా ఆడాను.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు!
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 147/8 మాత్రమే చేసింది. అనంతరం కేకేఆర్ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. తమ జట్టు మరోసారి ఫీల్డింగ్‌లో విఫలమైందని అంగీకరించాడు. ‘మేము బ్యాటింగ్‌లో కనీసం 15-20 పరుగులు తక్కువ చేశాం. పవర్‌ప్లేలో చాలా వికెట్లు కోల్పోయాం. తిలక్ వర్మ, నేను ఇంకొంచెం సేపు క్రీజులో ఉండి భాగస్వామ్యం నిర్మించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే ఈ పిచ్ బౌలర్లకు సహకారం అందించడం బాగుంది. ఇప్పుడు ఐపీఎల్ పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారుతోంది. బౌలర్లు చాలా నిస్సయంగా ఫీలవుతున్నారు’ అని హార్దిక్ చెప్పాడు.
తాజావార్తలు
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్‌మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్‌కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!