GT Biggest Win: ఎస్‌ఆర్‌హెచ్‌పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయం!

  • అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తోన్న గుజరాత్ టైటాన్స్
  • గుజరాత్ ఖాతాలో అరుదైన రికార్డు
  • 9 వికెట్లు తేడాతో 37 బంతులు మిగిలి ఉండగానే
GT Biggest Win

GT Biggest Win

Gujarat Titans Biggest Win in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తోంది. మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)పై గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. జీటీ తమ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 14.5 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇది టైటాన్స్‌కు పరుగుల పరంగా అతిపెద్ద విజయం. ఇంతకుముందు జీటీ అతిపెద్ద విజయం 77 పరుగులు. ఇదే సీజన్లో జైపూర్ వైదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)పై ఆ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు వికెట్ల పరంగా 2023లో బిగ్ విక్టరీ అందుకుంది. 2023లో రాజస్థాన్‌పై 9 వికెట్లు తేడాతో 37 బంతులు మిగిలి ఉండగానే లక్షాన్ని ఛేదించింది.

ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ అతిపెద్ద విజయాల జాబితా:
82 పరుగులు vs ఎస్‌ఆర్‌హెచ్, అహ్మదాబాద్, 2026
77 పరుగులు vs రాజస్థాన్ రాయల్స్, జైపూర్, 2026
62 పరుగులు vs ముంబై ఇండియన్స్, అహ్మదాబాద్, 2023 క్వాలిఫయర్-2
62 పరుగులు vs లక్నో సూపర్ జెయింట్స్, పుణే, 2022
58 పరుగులు vs రాజస్థాన్ రాయల్స్, అహ్మదాబాద్, 2025