Site icon NTV Telugu

IPL 2024: ఐపీఎల్ మ్యాచ్లపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు.. అది సరికాదు..!

Gambhir

Gambhir

ఐపీఎల్ 2024లో బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. బౌలర్ల కంటే బ్యాటర్ల డామినేషన్ ఎక్కువైంది. ఈ సీజన్ లో పలు జట్లు భారీ స్కోరులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. నిన్న కేకేఆర్-రాజస్థాన్ మధ్య కూడా భారీ స్కోరు నమోదైంది. ఇరు జట్లు 200కు పైగా పరుగులు చేశాయి. ఈ సీజన్ లో మొదటగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 549 పరుగులు నమోదయ్యాయి. అందులో 38 సిక్సర్లతో సహా 81 బౌండరీలు బాదారు. ఈ క్రమంలో.. కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: Physical Harassment: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు లైంగికదాడి.. కేకలు వేయడంతో..!

ఐపీఎల్‌లో డ్యూక్ బాల్‌ను ఉపయోగించాలని గౌతమ్ గంభీర్ తెలిపారు. ఈ సీజన్ లో బౌలర్లకు పిచ్ సహకరించడం లేదని.. ఫ్లాట్ పిచ్, బంతిలో స్వింగ్ లేకపోవడంతో ఈ సీజన్‌లో బౌలర్లు దారుణంగా విఫలమవుతున్నారన్నారు. ఈ క్రమంలో.. క్రికెట్ బంతుల తయారీ కంపెనీని మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు కూకబుర్రా కంపెనీ తయారు చేసిన బంతులతో ఆడుతున్నారు. ఐపీఎల్‌లో కూకబుర్రకు బదులుగా డ్యూక్ కంపెనీ బాల్‌ను ఉపయోగించాలని గౌతం గంభీర్ పేర్కొన్నారు.

Read Also: Moto G64 5G: భారత్ మార్కెట్ లోకి మోటో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ఒక కంపెనీ 50 ఓవర్ల పాటు ఆడే బంతిని తయారు చేయలేకపోతే, ఆ కంపెనీకి బదులుగా వేరే కంపెనీ బంతితో ఆడవలసి ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కూకబుర్రా బంతులను మాత్రమే ఉపయోగించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

Exit mobile version