Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్‌లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్
- ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్
- డీసీపై తీవ్ర విమర్శలు
- అందుకే భారీ మూల్యం చెల్లించుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. వరుసగా ఐదో ఏడాది కూడా టాప్-4లో చోటు దక్కకపోవడంతో డీసీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్‌ను ఢిల్లీ ఆరో స్థానంలో ముగించింది. 14 మ్యాచ్‌లలో ఏడు విజయాలు, ఏడు ఓటములతో 14 పాయింట్లు మాత్రమే సాధించింది. కీలక సమయాల్లో మ్యాచ్‌లను ముగించలేకపోవడమే తమ వైఫల్యానికి ప్రధాన కారణమని డీసీ హెడ్ కోచ్ హేమంగ్ బదానీ అంగీకరించాడు. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం అనంతరం మీడియాతో మాట్లాడిన బదానీ.. ఈ సీజన్లో ఎన్నో మ్యాచ్‌లు తమ చేతుల్లో నుంచి జారిపోయాయని పేర్కొన్నాడు.
‘చాలా మ్యాచ్‌లలో మేము విజయం సాధించాల్సింది. కానీ కీలక సమయాల్లో మా ప్లేయర్స్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. గుజరాత్ టైటాన్స్‌పై ఒక్క పరుగుతో ఓడిపోయిన మ్యాచ్ ఇప్పటికీ బాధగానే ఉంటుంది. అలాగే పంజాబ్ కింగ్స్‌పై 264 పరుగుల భారీ స్కోర్ చేసినా.. దాన్ని కాపాడుకోలేకపోయాం. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల్లో కీలక క్యాచ్‌లు వదిలేయడం కూడా మాకు భారీ నష్టంను కలిగించింది’ అని హేమంగ్ బదానీ వెల్లడించాడు. ఈ సీజన్లో డీసీ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ నిలకడ లేకపోవడం జట్టును తీవ్రంగా ప్రభావితం చేసింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
బ్యాటర్లు తరచూ వరుస వికెట్లు కోల్పోవడం ఢిల్లీకి పెద్ద సమస్యగా మారిందని హేమంగ్ బదానీ చెప్పాడు. ‘బ్యాటింగ్‌లో మేము చాలా సార్లు వరుసగా వికెట్లు కోల్పోయాం. అదే మ్యాచ్‌లను మలుపు తిప్పింది. బౌలింగ్ పరంగా చూస్తే.. ఎక్కువ వికెట్లు తీసే జట్లు సాధారణంగా టోర్నీలో ముందంజలో ఉంటాయి. కానీ మా బౌలర్లు 14 మ్యాచ్‌ల్లో కేవలం 64 వికెట్లు మాత్రమే తీశారు. ఇది లీగ్‌లో అత్యల్ప గణాంకాల్లో ఒకటి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గైర్హాజరీ కూడా మా ప్రస్థానాన్ని దెబ్బతీసింది. గత సీజన్లో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్క్.. ఈసారి తొలి తొమ్మిది మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. స్టార్క్ లేకపోయినా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మాకు చాలానే వచ్చాయి. చిన్న చిన్న తప్పిదాలు చేయకుండా ఉంటే మేము ఇప్పటికీ టోర్నీలో కొనసాగేవాళ్లం’ అని బదానీ తెలిపాడు.
ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవని ఫ్రాంచైజీల్లో ఉన్నాయి. డీసీ అత్యుత్తమ ప్రదర్శన 2020లో నమోదైంది. ఆ సీజన్లో తొలిసారి ఫైనల్ చేరిన ఢిల్లీ.. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి టైటిల్ కల నెరవేరకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఢిల్హ్హ్య్ క్యాపిటల్స్ గతంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరుతో ఆడిన విషయం తెలిసిందే. పేరు మార్చుకున్నా.. ఢిల్లీ రాత మాత్రం మారడం లేదు.
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!