NTV Telugu Site icon

Jake Fraser-McGurk: ఓకే ఓవర్‌లో 4,4,6,4,6,6.. మెక్‌గర్క్ విధ్వంసం వీడియో వైరల్‌!

Pawan Kalyan

Pawan Kalyan

Jake Fraser-McGurk Fires 30 Runs in Washington Sundar Bowling: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జెక్‌ ఫ్రేజర్-మెక్‌గర్క్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 15 బంతుల్లోనే అర్ధ శతకం చేసి.. ఐపీఎల్‌ 2024లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. అయితే మెక్‌గర్క్ ఓకే ఓవర్‌లో 30 పరుగులు చేయడం విశేషం.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు జెక్‌ ఫ్రేజర్-మెక్‌గర్క్ చుక్కలు చూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను సుందర్ వేయగా మెక్‌గర్క్‌ చెలరేగిపోయాడు. వరుసగా 4, 4, 6, 4, 6, 6 బాదాడు. 3 సిక్స్‌లు, 3 ఫోర్ల సాయంతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. మెక్‌గర్క్‌ బాడుతుంటే ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లకు ఏం చేయాలో అర్ధం కాలేదు. మెక్‌గర్క్‌ వీర బాదుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ ఇదేం బాదుడు రా అయ్యా అని కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024.. భారత జట్టు ఎంపికకు ముహూర్తం ఖరారు!

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అత్యంత వేగవంతంగా హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా జెక్‌ ఫ్రేజర్-మెక్‌గర్క్ నిలిచాడు. ఎస్‌ఆర్‌హెచ్‌పై మెక్‌గర్క్ 15 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ (17) పేరిట ఉంది. ఐపీఎల్‌ 2024లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా మెక్‌గర్క్‌ మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్ హెడ్‌ పేరిట ఉండేది. ఈ సీజన్‌లో వీరిద్దరూ 16 బంతుల్లో ఫిఫ్టీ చేశారు.