Site icon NTV Telugu

Rishbh Pant: గొప్ప మనసు చాటుకున్న రిషబ్‌ పంత్‌!

Rishabh Pant Dc

Rishabh Pant Dc

Rishabh Pant apologizes to Cameraman in DC vs GT: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. తాను కొట్టిన సిక్సర్‌కు గాయపడిన కెమెరామెన్‌కు క్షమాపణ చెప్పాడు. అంతేకాదు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధించాడు. ఇందుకు సంబందించిన ట్వీట్‌ను ఐపీఎల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. గొప్ప మనసు చాటుకున్న పంత్‌పై ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా బుధవారం గుజరాత్‌పై ఢిల్లీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ చెలరేగాడు. కేవలం 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. పంత్‌ కొట్టిన ఓ సిక్సర్‌ బీసీసీఐ కెమెరామెన్ దేబశిశ్ కు బలంగా తాకింది. ఇది తెలిసి పంత్‌ మ్యాచ్‌ అనంతరం ఆ కెమెరామెన్‌కు క్షమాపణ సందేశం పంపాడు. ‘సారీ దేబశిశ్‌ భాయ్. నిన్ను కొట్టాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. వీలైనంత త్వరగా నువ్ కోలుకుని మైదానంలోకి వస్తావని ఆశిస్తున్నా’ అని ఓ వీడియోలో పంత్ పేర్కొన్నాడు.

Also Read: Itel S24 Price: ‘ఐటెల్‌’ నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఫీచర్స్!

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రిషబ్ పంత్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ (43 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ 7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ 3 వికెట్స్ తీశాడు. భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి ఓడిపోయింది. సాయి సుదర్శన్‌ (65), డేవిడ్ మిల్లర్‌ (55) అర్ధ సెంచరీలు చేశారు.

Exit mobile version