Site icon NTV Telugu

GT vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

Gt Vs Dc

Gt Vs Dc

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్‌, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి.

CM Revanth Reddy: రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని.. 20 ఏళ్లు ఆయనే ఉంటారు..

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ ఆరో స్థానంలో కొనసాగుతుంది. 6 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయాలు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్.. తొమ్మిదో స్థానంలో ఉంది. 6 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. రెండింటిలో విజయాలు సాధించింది. బలాబలాల విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్‌లో రెండు జట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఢిల్లీతో పోలిస్తే గుజరాత్‌ కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఇరు జట్లలో ఇద్దరు విధ్వంసకర ఆటగాళ్లు వేర్వేరు కారణాల చేత గత కొన్ని మ్యాచ్‌లు దూరంగా ఉన్నారు. గుజరాత్‌ ఆటగాడు డేవిడ్‌ మిల్లర్‌ గాయం కారణంగా.. ఢిల్లీ ప్లేయర్‌ మిచెల్‌ మార్ష్‌ వ్యక్తిగత కారణాల చేత అందుబాటులో లేరు.

Bellamkonda: షైన్ స్క్రీన్స్ తో బెల్లంబాబు కొత్త సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది!

గుజరాత్ ప్లేయింగ్ ఎలెవన్:
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, శుభమాన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్.

ఢిల్లీ ప్లేయింగ్ ఎలెవన్:
పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

Exit mobile version