Site icon NTV Telugu

Sakshi Dhoni: ‘బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే’.. సాక్షి ధోనీ పోస్ట్ వైరల్!

Sakshi Dhoni

Sakshi Dhoni

Sakshi Dhoni’s Insta Story Goes Viral: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెపాక్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 212 స్కోరు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (98; 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్‌ 134 పరుగులకే ఆలౌటైంది. చెన్నై బౌలర్‌ తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ విజయంతో చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

Also Read: MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‌లో ‘ఒకే ఒక్కడు’!

అయితే ఈ మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి పెట్టిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘దయచేసి ఈ రోజు మ్యాచ్‌ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే. కాబోయే అత్తగా ఇదే నా రిక్వెస్ట్‌’ అని సాక్షి తన ఇన్‌స్టా గ్రామ్‌ స్టోరీలో పేర్కొన్నారు. అంటే సాక్షి-ధోనీలు అత్తమామ కాబోతున్నారన్నమాట. కంగ్రాట్స్ అంటూ ఈ పోస్ట్ చూసిన ఫాన్స్, నెటిజెన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక సాక్షి అభ్యర్థనను చెన్నై జట్టు విన్నట్లు ఉంది. సాక్షి కోరుకున్న విధంగానే మ్యాచ్ త్వరగానే పూర్తయింది.

Exit mobile version