CSK vs PBKS: చెన్నైకి ధోనీ, శ్రేయాస్ డౌట్.. సీఎస్‌కే vs పంజాబ్ ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్!
- ఈరోజు తలపడనున్న సీఎస్‌కే, పీబీకేఎస్
- బోణి కొట్టాలని చూస్తోన్న సీఎస్‌కే
- మరో విజయం ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా పీబీకేఎస్
- సీఎస్‌కే vs పంజాబ్ ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్ రికార్డ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు తలపడనున్నాయి. పీబీకేఎస్‌పై విజయం సాధించి ఈ సీజన్‌లో బోణి కొట్టాలని సీఎస్‌కే చూస్తోంది. మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు సీఎస్‌కే ఆ ఓటమిని మరిచిపోయి.. తమ ప్రచారాన్ని సరికొత్తగా ప్రారంభించాలని లక్ష్యంగా ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మార్చి 31న గుజరాత్ టైటాన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్‌కేపై గెలిచి మరో విజయం ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది.
చెన్నైకి ధోనీ:
సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పిక్క గాయం నుంచి కోలుకుంటున్నందున గౌహతికి వెళ్లలేదు. అయితే పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కు డగౌట్‌లో ఉండే అవకాశం ఉంది. ఇది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు ఎంతగానో ఉపయోగపడనుంది. ధోనీ రాకతో చెన్నై స్టేడియం మార్మోగనుంది. సీఎస్‌కే తరఫున తన మొదటి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని సంజు శాంసన్.. పీబీకేఎస్‌పై చెలరాలని చూస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు డెవాల్డ్ బ్రెవిస్ అందుబాటులో లేడు. అతను పక్కటెముకల గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడో లేదో ఇంకా స్పష్టత లేదు. ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మలు చెలరేగాల్సిన అవసరం ఉంది. బౌలర్లు మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ గాడిన పడితే ప్రత్యర్థులను తక్కువ స్కోరుకే పరిమితం చేయొచ్చు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
శ్రేయస్ డౌట్:
గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు ఆటగాడు కూపర్ కనోలి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్‌లో పేలవమైన ఆరంభం నుంచి జట్టును గట్టెక్కించిన కనోలి నుంచి మరో కీలక ఇన్నింగ్స్ ఆశిస్తోంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు గాయం కావడం పంజాబ్‌కు ఆందోళన కలిగిస్తోంది. శ్రేయస్‌కు ఎముక విరగలేదని, కానీ అతని చేయి వాచిందని జట్టు యాజమాన్యం తెలిపింది. ఈ మ్యాచ్‌కు శ్రేయస్ అందుబాటులో ఉంటాడో లేదో తెలియదు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య మంచి ఆరంభం ఇవ్వాల్సి ఉంది. నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ రాణించాల్సిన అవసరం ఉంది. పేసర్ విజయ్‌కుమార్ విశాక్ రాణించగా.. అర్ష్‌దీప్ సింగ్ నిరాశపర్చాడు.
హెడ్ టు హెడ్:
ఐపీఎల్‌లో సీఎస్‌కే, పీబీకేఎస్ జట్లు 32 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఈ 32 మ్యాచ్‌లలో సీఎస్‌కే 16 సార్లు గెలుపొందగా.. పీబీకేఎస్ 16 సార్లు విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఇటీవలి మ్యాచ్‌లలో పంజాబ్ ఆధిపత్యం చెలాయించింది. చెన్నైపై తమ చివరి ఏడు మ్యాచ్‌లలో ఆరింటిలో విజయం సాధించింది. అయితే చేపాక్ చెన్నైకి కంచుకోటగా ఉండటంతో.. ఈ మ్యాచ్ పంజాబ్‌కు సవాల్ అనే చెప్పాలి.
తుది జట్లు (అంచనా):
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, జామీ ఓవర్‌టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.
ఇంపాక్ట్ ప్లేయర్: సర్ఫరాజ్ ఖాన్/ప్రశాంత్ వీర్.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ విశాక్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చాహల్/యశ్ ఠాకూర్.
తాజావార్తలు
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!