Site icon NTV Telugu

CSK Injury Update: సీఎస్‌కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్.. గుడ్ న్యూస్ ఏంటంటే?

Csk Big Shock

Csk Big Shock

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవడానికి పోరాడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు బిగ్ షాక్. మ్యాచ్ విన్నర్, యువ ఆటగాడు ఆయుష్ మాత్రే గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయుష్ స్థానంలో ఎలాంటి రీప్లేస్‌మెంట్‌ను తీసుకోవాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ భావించడం లేదని సమాచారం. జట్టులో ఉన్న ఆటగాళ్లతోనే ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

శనివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. రెండో సింగిల్‌ తీసే క్రమంలో ఎడమ కాలి కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి చికిత్స చేశాక బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే తర్వాత బంతికే అవుట్ అయి డగౌట్‌కు వెళ్లిపోయాడు. మాత్రేకు అయిన గాయం తీవ్రంగానే ఉందని బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ చెప్పాడు. స్కానింగ్‌ చేశాక ఎన్ని రోజులు దూరమవుతాడనే విషయం స్పష్టంగా తెలుస్తుందని తెలిపాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆయుష్ గాయం పెద్దదే అని, టోర్నీ మొత్తానికి దూరమవుతాడని తెలుస్తోంది.

బౌలింగ్ విభాగంలో భారీ దెబ్బ తగిలింది. పేసర్ ఖలీల్ అహ్మద్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దీంతో సీఎస్‌కే నెట్ బౌలర్లలో పలువురిని పరిశీలిస్తోంది. అందులో ఒకరిని త్వరలోనే ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. ఆకాష్ మధ్వాల్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అయుష్స్థా మాత్రే స్థానంలో ఉర్విల్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యువ ఆటగాడైన ఉర్విల్ పటేల్‌కు ఇది మంచి అవకాశం కానుంది.

ఇక సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముంబై ఇండియన్స్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధోనీ రీఎంట్రీ జట్టుకు మానసిక బలాన్ని ఇవ్వడమే కాకుండా మ్యాచ్ ఫలితంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సీఎస్‌కేకు గాయాలు పెద్ద సవాలుగా మారినా.. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం, ధోనీ లాంటి అనుభవజ్ఞుడు తిరిగి వస్తుండడం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ముంబైతో మ్యాచ్‌కు ముందు వచ్చిన ఈ అప్‌డేట్లు జట్టులో మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

 

Exit mobile version