CSK Injury Update: సీఎస్‌కేకు బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మ్యాచ్ విన్నర్ అవుట్.. గుడ్ న్యూస్ ఏంటంటే?
- ప్లే ఆఫ్స్ రేసులో నిలవడానికి పోరాడుతున్న సీఎస్‌కేకు షాక్
- సీజన్ మొత్తానికి మాత్రే దూరమయ్యే అవకాశాలు
- ఆకాష్ మధ్వాల్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసులో నిలవడానికి పోరాడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు బిగ్ షాక్. మ్యాచ్ విన్నర్, యువ ఆటగాడు ఆయుష్ మాత్రే గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయుష్ స్థానంలో ఎలాంటి రీప్లేస్‌మెంట్‌ను తీసుకోవాలని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ భావించడం లేదని సమాచారం. జట్టులో ఉన్న ఆటగాళ్లతోనే ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
శనివారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. రెండో సింగిల్ తీసే క్రమంలో ఎడమ కాలి కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి చికిత్స చేశాక బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే తర్వాత బంతికే అవుట్ అయి డగౌట్‌కు వెళ్లిపోయాడు. మాత్రేకు అయిన గాయం తీవ్రంగానే ఉందని బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ చెప్పాడు. స్కానింగ్ చేశాక ఎన్ని రోజులు దూరమవుతాడనే విషయం స్పష్టంగా తెలుస్తుందని తెలిపాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆయుష్ గాయం పెద్దదే అని, టోర్నీ మొత్తానికి దూరమవుతాడని తెలుస్తోంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
బౌలింగ్ విభాగంలో భారీ దెబ్బ తగిలింది. పేసర్ ఖలీల్ అహ్మద్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దీంతో సీఎస్‌కే నెట్ బౌలర్లలో పలువురిని పరిశీలిస్తోంది. అందులో ఒకరిని త్వరలోనే ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనుంది. ఆకాష్ మధ్వాల్‌కు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. అయుష్స్థా మాత్రే స్థానంలో ఉర్విల్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యువ ఆటగాడైన ఉర్విల్ పటేల్‌కు ఇది మంచి అవకాశం కానుంది.
ఇక సీఎస్‌కే అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే.. లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ముంబై ఇండియన్స్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ధోనీ రీఎంట్రీ జట్టుకు మానసిక బలాన్ని ఇవ్వడమే కాకుండా మ్యాచ్ ఫలితంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సీఎస్‌కేకు గాయాలు పెద్ద సవాలుగా మారినా.. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం, ధోనీ లాంటి అనుభవజ్ఞుడు తిరిగి వస్తుండడం జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ముంబైతో మ్యాచ్‌కు ముందు వచ్చిన ఈ అప్‌డేట్లు జట్టులో మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?