SRH vs CSK: చెన్నై విజయం.. విఫలమైన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 78 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో సీఎస్కే విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. ఈ మ్యాచ్ లో ఓటమితో సన్ రైజర్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లు రాణించలేకపోయారు. ట్రేవిస్ హెడ్ (13), అభిషేక్ శర్మ (15) పరుగులతో నిరాశ పరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మార్క్రమ్ (32) కాస్త పర్వాలేదనిపించాడు. కానీ.. పతిరణ వేసిన బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (15) పెద్దగా ఆకట్టులేకపోయాడు. క్లాసెన్ (20), సమద్ (19), షాబాజ్ అహ్మద్ (7), ప్యాట్ కమిన్స్ (5), భువనేశ్వర్ (4) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే కీలకమైన 4 వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ముస్తాఫిజుర్, పతిరన తలో రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా, శార్ధూల్ ఠాకూర్ కు తలో వికెట్ దక్కింది.
Janasena: జనసేనకు గ్లాసు గుర్తునే కామన్ సింబల్‌గా కేటాయించిన ఈసీ
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. అతనికి తోడు శివం దూబే (39*) పరుగులతో చెలరేగాడు. చెన్నై బ్యాటింగ్ లో అజింక్యా రహానే (9) పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత గైక్వాడ్ (98), మిచెల్ (52) పరుగులతో అదరగొట్టారు. రుతురాజ్, డారిల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండో వికెట్‌కు 107 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గైక్వాడ్ ఈ సీజన్లో తన మూడో అర్ధ సెంచరీని సాధించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శివం దూబే (39) బౌలర్లపై దండయాత్ర చేశారు. చివర్లో ధోనీ (5) పరుగులు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు. కమిన్స్, షాబాజ్ అహ్మద్ వికెట్ సాధించలేకపోయారు.
CM Revanth: బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే.. సీఎం కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!