Cameron Green Trolls: 18, 2, 4.. 25 కోట్లు బొక్క.. కామెరూన్ గ్రీన్‌ను ఎలిమినేట్ చేయండి సర్!
- ఐపీఎల్ 2026లో విఫలమవుతున్న గ్రీన్
- ఐపీఎల్ 2026లో 18, 2, 4 స్కోర్లు
- కామెరూన్ గ్రీన్‌పై కేకేఆర్ ఫాన్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 సీజన్‌లో విఫలమవుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. భారీ అంచనాల మధ్య జట్టులోకి వచ్చిన గ్రీన్.. తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరుతూ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌పై జరిగిన మొదటి మ్యాచ్‌లో 10 బంతుల్లో 18 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈరోజు పంజాబ్ కింగ్స్‌పై 2 బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో కామెరూన్ గ్రీన్ ప్రదర్శన చెత్తగా ఉంది. దాంతో కేకేఆర్ అభిమానులు సోషల్ మీడియాలో గ్రీన్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు కీలక సమయాల్లో రాణించలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. రూ.25 కోట్లు భారీ ధరకు కొనుగోలు చేసిన ఆటగాడు.. జట్టుకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 25 కోట్లు బొక్క, గ్రీన్‌ను ఎలిమినేట్ చేయండి సర్ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
Also Read: AP Weather Forecast: ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. రెండు రోజులు వర్షాలు, వడగాలులు!
ఐపీఎల్ 2026 మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌కు కాసుల వర్షం కురిసింది. అతడు బేస్ ప్రైస్ రూ.2 కోట్లు కాగా.. రూ.25.20 కోట్లు వెచ్చించి కేకేఆర్ దక్కించుకుంది. దీంతో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఎన్నో అంచనాల మధ్య గ్రీన్ ఐపీఎల్ 2026లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 18, 2, 4 రన్స్ చేశాడు. దాంతో అతడిపై ట్రోల్స్ మొదలయ్యాయి. కొంతమంది అభిమానులు గ్రీన్‌ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అతని స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. చూడాలి మరి కేకేఆర్ మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో.
తాజావార్తలు
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
-
Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!