ఐపీఎల్ 2024లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ లో క్వింటాన్ డికాక్ (81) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ (40*) పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్స్ దూకుడుగా ఆడటంతో బెంగళూరు ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచింది.
Read Also: Mahua moitra: మహువా మొయిత్రాకు షాక్.. ఈడీ కేసు నమోదు
లక్నో బ్యాటింగ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (20), పడిక్కల్ (6), స్టోయినీస్ (24) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో మ్యాక్స్ వెల్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత టోప్లీ, యష్ దయాల్, సిరాజ్ తలో వికెట్ సాధించారు.
Read Also: 2024 Maruti Suzuki Swift: న్యూ అవతార్‌లో మారుతి సుజుకీ స్విఫ్ట్.. లాంచింగ్ ఎప్పుడంటే..?