Arshdeep Singh Trolls: రీల్స్, గర్ల్‌ఫ్రెండ్‌పై కాదు.. బౌలింగ్‌పై దృష్టి పెట్టు సింగ్ సాబ్!

  • స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న అర్ష్‌దీప్
  • భారీగా పరుగులు ఇస్తున్న అర్ష్‌దీప్
  • అర్ష్‌దీప్‌ను ఆటాడుకుంటున్న నెటిజెన్స్
Arshdeep Singh Trolls

Arshdeep Singh Trolls

Netizens Trolls Arshdeep Singh: ఐపీఎల్ 2026 సీజన్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న అర్ష్‌దీప్.. ఈ సీజన్‌లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. గత సీజన్లలో పీబీకేఎస్‌కు కీలక బౌలర్‌గా సేవలందించిన అతడు.. ఈసారి మాత్రం భారీగా పరుగులు ఇస్తూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్ గణాంకాలు చూస్తే అతని ఫామ్‌ ఎంతలా పడిపోయిందో ఇట్టే తెలుస్తోంది.

అర్ష్‌దీప్ సింగ్ తాజాగా రాజస్థాన్‌పై 4 ఓవర్లలో 68 పరుగులు ఇచ్చాడు. అంతకుముందు ఢిల్లీపై 49 పరుగులు, లక్నోపై 41 పరుగులు సమర్పించుకున్నాడు. హైదరాబాద్‌పై 50 పరుగులు, చెన్నైపై 41 పరుగులు, ముంబైపై 42 పరుగులు ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లలో కేవలం 8 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఓవరుకు సగటు 11 ఎకానమీ రేట్ నమోదు చేశాడు. అదనంగా 16 వైడ్లు వేయడం అతని బౌలింగ్ నియంత్రణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెటిజెన్స్ కూడా వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ అతడిని ట్రోల్స్ చేస్తున్నారు. రీల్స్, గర్ల్‌ఫ్రెండ్‌పై దృష్టి పెట్టడం మానేసి.. బౌలింగ్‌పై దృష్టి పెట్టు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్ 2026లో అర్ష్‌దీప్ సింగ్ గణాంకాలు చూస్తే.. సింగ్ సాబ్ తన లైన్, లెంగ్త్‌పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులు అదుపు చేయడంలో విఫలమవడం జట్టుకు భారంగా మారుతోంది. టీ20 ఫార్మాట్‌లో బౌలర్లకు ఒత్తిడి ఎక్కువగా ఉండటం సహజమే అయినప్పటికీ.. నిలకడ చాలా ముఖ్యం. ప్రతి ఆటగాడికి ఫామ్‌లో ఎత్తుపల్లాలు సహజం. సరైన ప్రాక్టీస్, ఫోకస్‌తో అర్ష్‌దీప్ మళ్లీ తన బెస్ట్ ఫామ్‌కు చేరుకుంటాడనే నమ్మకం అభిమానుల్లో ఉంది.