Arshdeep Singh Expensive Over: ఒకే ఓవర్లో 10 బంతులు, 24 రన్స్.. అర్ష్‌దీప్ సింగ్‌తో మాములుగా ఉండదు మరి!
- ఐపీఎల్ 2025లో ఇరగదీసిన అర్ష్‌దీప్ సింగ్
- ఐపీఎల్ 2026లో అర్ష్‌దీప్ పేలవ ప్రదర్శన
- ఒకే ఓవర్లో 10 బంతులు, 24 రన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arshdeep Singh Concedes 24 Runs in an Over: ఐపీఎల్ 2025లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఇరగదీశాడు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) తరఫున 21 వికెట్లు తీసి అత్యుత్తమ ఫామ్ కనబర్చాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం తేలిపోతున్నాడు. ఒత్తిడికి లోనై అదనపు పరుగులు ఎక్కువగా ఇస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో మొత్తం 11 బంతులు విసిరాడు. అందులో 4 వైడ్ బంతులు ఉన్నాయి. ఆ ఓవర్లో మొత్తంగా 24 పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా మరోసారి ఒత్తిడికి లోనై చెత్త ప్రదర్శన చేశాడు.
ముల్లాన్‌పుర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జరుగుతున్న మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మరో అత్యంత ఖరీదైన ఓవర్‌ను నమోదు చేశాడు. ఒకే ఓవర్లో 10 బంతులు వేయగా.. ఇందులో నాలుగు వైడ్ బంతులు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగడంతో మొత్తగా 24 రన్స్ సమర్పించుకున్నాడు. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు. దాంతో అర్ష్‌దీప్ బౌలింగ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అర్ష్‌దీప్ ఇదేం బౌలింగ్, అర్ష్‌దీప్ సింగ్‌తో మాములుగా ఉండదు మరి, ఇలా అయితే పంజాబ్ గెలవడం కష్టమే అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
- Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ 24 రన్స్ ఇచ్చుకున్నాడు. మొదట షార్ట్ బాల్‌ను మిడ్‌వికెట్ వైపు ఫోర్‌గా మలిచిన అభిషేక్ శర్మ.. తర్వాతి బంతికి అద్భుత టైమింగ్‌తో మరో ఫోర్ బాదాడు. దాంతో ఒత్తిడికి లోనైన అర్ష్‌దీప్.. నాలుగు వైడ్లు వేశాడు. ఆపై స్లోయర్ బాల్‌ను ముందుగానే అంచనా వేసి లాంగ్ ఆన్ మీదుగా అభిషేక్ భారీ సిక్స్ కొట్టాడు. మరో బంతిని షార్ట్ థర్డ్‌మ్యాన్ మీదుగా టాప్ ఎడ్జ్‌తో సిక్స్‌గా మార్చాడు. ఈ ఓవర్లో అర్ష్‌దీప్ తేలిపోవడంతో పంజాబ్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు సన్‌రైజర్స్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!