Anshul Kamboj-CSK: అన్షుల్ అదరహో.. సీఎస్కేకు బిగ్ మ్యాచ్ విన్నర్‌గా యువ సంచలనం!
- ఐపీఎల్ 2026లో జోరందుకున్న సీఎస్కే
- సీఎస్కే విజయాల్లో యువ పేసర్ అన్షుల్ కీలక పాత్ర
- సీఎస్కేకు బిగ్ మ్యాచ్ విన్నర్‌గా యువ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anshul Kamboj shines as CSK’s key bowler in IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హ్యాట్రిక్ ఓటములను ఎదుర్కొంది. ఈ సీజన్‌ను పేలవంగా ఆరంభించిన సీఎస్కే.. కాస్త ఆలస్యంగా అయినా జోరందుకుంది. వరుసగా రెండు అద్భుత విజయాలతో నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. చెన్నై విజయాల్లో యువ పేసర్ అన్షుల్ కాంబోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అద్భుత ప్రదర్శనతో జట్టుకు కీలక బౌలర్‌గా మారుతున్నాడు. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. అన్షుల్ రూపంలో చెన్నై బౌలింగ్ దళానికి కొత్త బలం వచ్చింది.
ఐపీఎల్లో పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడం బౌలర్లకు చాలా కష్టం. అయితే అన్షుల్ కాంబోజ్ తన కట్టుదిట్టమైన లైన్-లెంగ్త్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తూ కీలక వికెట్లు తీస్తున్నాడు. ఆరంభంలోనే బ్రేక్ త్రూ ఇస్తూ జట్టుకు మంచి ఆరంభం అందిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో కూడా ప్రభావం చుపుతున్నాడు. బ్యాటర్లు క్రీజులో సెట్ అవుతున్న సమయంలో కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెడుతున్నాడు. వేరియేషన్స్, వేగంలో మార్పులు బ్యాటర్లకు సవాల్‌గా మారుతున్నాయి. డెత్ ఓవర్లలో కూడా అన్షుల్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. చివరి ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా.. యార్కర్లు, స్లో బాల్స్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలోనూ రాణించడం అతడిని ప్రత్యేక బౌలర్‌గా నిలబెడుతోంది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Ajinkya Rahane: అదే మా కొంపముంచింది.. ఇక మార్పులు తప్పవు!
ఐపీఎల్ 2026 సీజన్లో అన్షుల్ కాంబోజ్ ఇప్పటికే 10 వికెట్లు పడగొట్టాడు. కీలక వికెట్స్ పడగొడుతూ సీఎస్కే బౌలింగ్ లైనప్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్లో కూడా అన్షుల్ రాణించాడు. 8 మ్యాచ్‌లలో 8 వికెట్స్ పడగొట్టాడు. ఈ సీజన్లో 5 మ్యాచ్‌లలో 10 వికెట్స్ తీశాడు. సీనియర్ పేసర్ల మధ్య యువ ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అన్షుల్ ప్రదర్శన ఇలానే కొనసాగితే.. సీఎస్కేకు భవిష్యత్తులో బిగ్ మ్యాచ్ విన్నర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2026 కోసం అతడిని చెన్నై రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది.
తాజావార్తలు
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!