IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Retentions 2027-MS Dhoni: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు కూర్పుపై చర్చ మొదలైంది. ముఖ్యంగా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్, సీఎస్కే మాజీ స్టార్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వచ్చే సీజన్లో ధోనీ ఆడే ఉద్దేశం లేకపోతే.. అతడిని కూడా రిటైన్ చేయకుండా విడుదల చేసే విషయాన్ని సీఎస్కే పరిశీలించాలన్నాడు. అలా చేస్తే వేలం కోసం జట్టు పర్స్‌లో మరో రూ.4 కోట్లు అందుబాటులోకి వస్తాయని యాష్ అభిప్రాయపడ్డాడు.
తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన అశ్విన్.. రాహుల్ చహర్, ప్రశాంత్ వీర్లతో పాటు ఎంఎస్ ధోనీని కూడా విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎస్కేకు సూచించాడు. ‘సీఎస్కే రాహుల్ చహర్‌ను విడుదల చేయవచ్చు. ప్రశాంత్ వీర్ విషయంలోనూ ఇదే ఆలోచించాలి. అసలు ఎంఎస్ ధోనీ సంగతేంటి?. ఆడే ఉద్దేశం లేకపోతే ఎందుకు జట్టులో ఉండడం, విడుదల చేయడమే మంచిది. ధోనీ ఆటగాడిగా కాకుండా జట్టులో ఇతర బాధ్యతలు తీసుకోవచ్చు. మహీ భాయ్ వచ్చే సీజన్లో ఆడకపోతే ఆ రూ.4 కోట్లను వేలంలో ఉపయోగించుకోవడం మంచిది’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
Also Read
- IPL 2027 Retention Live: రిటెన్షన్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు?.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
- Lakshya Raichandani: ఆ ఐపీఎల్ టీమ్‌లో ఆడడమే నా టార్గెట్.. మనసులో మాట చెప్పేసిన అండర్-19 కెప్టెన్!
- IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
- IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
మాట్ షార్ట్, కార్తిక్ శర్మలను కూడా విడుదల చేసే అవకాశాన్ని సీఎస్కే పరిశీలించవచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ ఆటగాళ్లందరినీ విడుదల చేస్తే వేలంలో సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.45 కోట్ల వరకు పర్స్‌తో బరిలోకి దిగవచ్చని చెప్పాడు. తద్వారా జట్టుకు అవసరమైన ఆటగాళ్లను కొత్తగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని వివరించాడు. అయితే యువ ఆటగాడు కార్తిక్ విషయంలో అశ్విన్ మరో ఆసక్తికర అభిప్రాయాన్ని వెల్లడించాడు. గత వేలంలో కార్తిక్ కోసం సీఎస్కే ఏకంగా రూ.14.2 కోట్లు ఖర్చు చేసింది. దీంతో అతడు ప్రశాంత్ వీర్‌తో కలిసి అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇప్పుడు అతడిని విడుదల చేసి, వేలంలో తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం చేయవచ్చని అశ్విన్ సూచించాడు.
‘కార్తిక్ శర్మలో మంచి ప్రతిభ ఉంది. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. అయితే ఆ స్థానంలో శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఆడగలరు. వికెట్ కీపర్‌గా ఉర్విల్ పటేల్ కూడా జట్టులో ఉన్నాడు. కార్తిక్ కావాలనుకుంటే ముందుగా విడుదల చేసి, వేలంలో తక్కువ ధరకు తిరిగి తీసుకునే ప్రయత్నం చేయవచ్చు’ అని అశ్విన్ వివరించాడు. గత సీజన్లో కార్తిక్ నిలకడగా రాణించకపోయినా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తం 295 పరుగులు సాధించి, 32.7 సగటుతో రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. దీంతో అతడిని కొనసాగించాలా? లేక విడుదల చేసి మళ్లీ తక్కువ ధరకు కొనుగోలు చేయాలా? అనేది సీఎస్కే యాజమాన్యం ముందున్న ప్రశ్నగా మారింది.
తాజావార్తలు
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
-
Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
-
ASEAN Summit 2026: ప్రపంచానికి ఇప్పుడు శాంతి, స్థిరత్వమే అత్యవసరం.. ఆసియాన్ సదస్సులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Rahul Gandhi Reveals Dating Story: తన తల్లిదండ్రులు ప్రేమలో పడిన రెస్టారెంట్‌కే గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర విషయాలు!
ట్రెండింగ్
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!