NTV Telugu Site icon

IPL 2024: గెలుపుతో ముద్దులతో ముంచెత్తిన ప్రీతీ జింటా.. పాపం కావ్య పాప..!

2

2

ఐపీఎల్ – 2024 సీజన్‌‌ ను పంజాబ్ కింగ్స్ గెలుపుతో ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం 3 : 30 కుజరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తో జరిగిన ఉత్కంఠ పోరులో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముఖ్యంగా సామ్ కరణ్, లియామ్ లివింగ్‌స్టోన్ లు ఆడిన సంచలన బ్యాటింగ్‌ తో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయం నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌ కు హాజరైన ప్రీతీ జింటా.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె డగౌట్‌ లో తన రియాక్షన్స్‌ తో అభిమానులను ఆకట్టుకుంది. పంజాబ్ ఆటగాళ్లు బౌండరీ బాదినప్పుడల్లా, వికెట్లు తీసినప్పుడల్లా ఎగిరి గంతేసింది.

Also read: Tirumala: రేపు తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు పంజాబ్‌పై భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. మొత్తం 20 ఓవర్లలో, జట్టు 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత పంజాబ్ ఆల్ రౌండర్ సామ్‌ కర్రాన్ అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ తోపాటు, లియామ్ లివింగ్‌స్టోన్ సహకారంతో పంజాబ్ కింగ్స్ నాలుగు బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఇక శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా రైట్ నైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా రైట్ నైడర్స్ ఆడాయి.

ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడి ఓడింది. హెన్రిచ్ క్లాసెన్ కేవలం 29 బంతుల్లో 63 పరుగుల తన మెరుపు ఇన్నింగ్స్ తో హైదరాబాద్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లినా చివరి ఓవర్ లో మ్యాచ్ తారుమారైంది. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ హై స్కోర్ మ్యాచ్ లో హైదరాబాద్ కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ కావ్య మారన్ రియాక్షన్ కూడా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫలితంలానే.. క్షణాల్లో మారిపోయింది. తండ్రి కళానిధి మారన్‌ తో కలిసి ఈ మ్యాచ్‌ కు హాజరైన కావ్య మారన్.. మ్యాచ్ జరుగుతున్నంత సేపు కెమెరాకు కనబడకుండా జాగ్రత్తగా మ్యాచ్ చూసింది. మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 24 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి రాగా.. అందరూ ఓటమి ఖాయమని అనుకున్నారు. కాకపోతే ఆ సమయంలో హెన్రీచ్ క్లాసెన్ సంచలన బ్యాటింగ్‌ కు తోడుగా షెహ్‌బాజ్ అహ్మద్ కూడా 2 భారీ సిక్స్‌ లు కొట్టడంతో సన్‌రైజర్స్ విజయానికి ఆఖరి ఓవర్‌ లో కేవలం 13 పరుగులు అవసరమయ్యాయి. ఇక చివరి ఓవర్ లో హర్షీత్ రాణా వేసిన తొలి బంతినే హెన్రీచ్ క్లాసెన్ భారీ సిక్సర్ బాదాడు.

Also read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇంకేముంది హైదరాబాద్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు. ఇంకేముంది ఈ దెబ్బకి కావ్య మారన్ సైతం తన తండ్రితో కలిసి ఎగిరి గంతేసింది. విజయం తమదేనని ఖాయమని చిరునవ్వులు చిందించింది. కాకపోతే ఆ ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. రెండో బంతికి క్లాసెన్ సింగిల్ తీయగా.. మూడో బంతికి షెహ్‌బాజ్ అహ్మద్ భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యి మ్యాచ్ చేజారేలా చేసుకున్నారు. ఫస్ట్ బాల్ కు సిక్స్ కొట్టడంతో గెలుపు ఖాయమని ఎగిరి గంతేసిన కావ్య మారన్ ఆఖరి బంతి తర్వాత దు:ఖంలో మునిగిపోయింది. ఆమె తండ్రి కళానిధి మారన్ కూడా తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం తండ్రీకూతుర్లు ఇదహారు తీవ్ర బాధతో కనిపించారు. ప్రస్తుతం కావ్య కు సంబంధించిన రియాక్షన్‌ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ గా మారాయి.