IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!
- ఐపీఎల్ అంటేనే భారీ షాట్లు, సిక్సర్ల వర్షం
- ఫాస్ట్ బౌలర్ల దుమ్మురేపే ప్రదర్శనలు కూడా
- ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fastest Ball in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సాధారణంగా భారీ షాట్లు, సిక్సర్ల వర్షం గుర్తుకు వస్తుంది. అయితే బ్యాటర్ల హవా ఎంత ఉంటుందో.. అదే స్థాయిలో ఫాస్ట్ బౌలర్ల దుమ్మురేపే ప్రదర్శనలు కూడా అభిమానులను వావ్ అనిపిస్తాయి. ముఖ్యంగా 150+ కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే బౌలర్లు మ్యాచ్‌ను ఉన్నపళంగా మలుపుతిప్పే సామర్థ్యం కలిగి ఉంటారు. కొందరు బౌలర్లు తమ ఫాస్టెస్ట్ డెలివరీలతో ఔరా అనిపించారు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో ఈ టి20 లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా బంతులు విసిరిన ఫాస్ట్ బౌలర్ల జాబితాపై ఓ లుక్కేద్దాం.
అగ్రస్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం:
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వేగంతో బంతి విసిరిన బౌలర్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం షాన్ టెయిట్ అగ్రస్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన టెయిట్.. 2011లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 157.71 కిమీ/గం వేగంతో బంతి విసిరి రికార్డు సృష్టించాడు. అతని రా అండ్ రస్టిక్ పేస్ కారణంగా ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా యువ పేసర్ జెరాల్డ్ కోట్జీ ఉన్నాడు. 2024లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ.. రాజస్థాన్ రాయల్స్‌పై గంటకు 157.4 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని నమోదు చేశాడు. ఈ తరం బౌలర్లలో జెరాల్డ్ అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడు.
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
భారత బౌలర్లకు చోటు:
ఈ జాబితాలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ మూడో స్థానంలో నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున 2022 ఐపీఎల్ ఫైనల్లో 157.3 కిమీ/గం వేగంతో బంతి విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదే సంవత్సరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పేసర్ ఉమ్రాన్ మాలిక్ 157.0 కిమీ/గం వేగంతో బంతి విసిరి మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన యువ బౌలర్ మయాంక్ యాదవ్ ఉన్నాడు. 2024లో 156.7 కిమీ/గం వేగంతో బంతి విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సీజన్లో 155.8 కిమీ/గం వేగంతో మరోసారి ఈ జాబితాలో చోటు సంపాదించాడు.
Also Read: Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!
అన్రిచ్ నోర్జే, డేల్ స్టెయిన్ కూడా:
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే కూడా తన వేగంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2020లో 156.22 కిమీ/గం వేగంతో బంతి విసిరాడు. అదే సీజన్లో 155.1 కిమీ/గం వేగంతో మరోసారి రికార్డు సృష్టించాడు. దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. డెక్కన్ ఛార్జర్స్ తరఫున 2012లో 154.4 కిమీ/గం వేగంతో బంతి విసిరి తన ప్రతిభను చాటాడు. కగిసో రబడా 2019లో 154.23 కిమీ/గం వేగంతో ఈ జాబితాలో చోటు సంపాదించాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ 152 కిమీ/గం వేగంతో బంతి విసిరి టాప్-10 జాబితాలో ఉన్నాడు.
దేశ క్రికెట్‌కు మంచి సూచిక:
మొత్తంగా చూస్తే.. ఐపీఎల్ కేవలం బ్యాటర్లకే కాదు, ఫాస్ట్ బౌలర్లకు కూడా తమ ప్రతిభను నిరూపించుకునే గొప్ప వేదికగా మారింది. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్ లాంటి యువ భారత బౌలర్లు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం దేశ క్రికెట్‌కు మంచి సూచికగా చెప్పుకోవచ్చు. రానున్న సీజన్లలో ఈ రికార్డులు బ్రేక్ అవుతాయేమో చూడాలి.
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!